- ( ఉత్త‌రాంధ్ర - ఇండియా హెరాల్డ్ ) . . .

పార్వతీపురం: పద్మభూషణ్, నటసింహం నందమూరి బాలకృష్ణ గారి పుట్టినరోజును పురస్కరించుకుని విద్య, ఐటీ శాఖల మంత్రి నారా లోకేష్ సమక్షంలో ముందస్తు జన్మదిన వేడుకలు నిర్వహించారు. నారా లోకేష్ సోమ‌వారం ఉత్త‌రాంధ్ర లోని పార్వ‌తీ పురం మ‌న్యం జిల్లా ప‌ర్య‌ట‌న‌లో ఉన్నారు. ఈ క్ర‌మంలోనే అక్క‌డ ప‌లు స‌మావేశాల్లో పాల్గొన‌గా ప్ర‌జ‌ల నుంచి విశేష స్పంద‌న ల‌భించింది. ప‌లువురు లోకేష్ ను ఫ్రీ గా క‌లిసి త‌మ స‌మ‌స్య‌లు చెప్పుకున్నారు. లోకేష్ చాలా ఓపిక గా వారంద‌రి స‌మ‌స్య‌లు సావ‌ధానంగా విని కొన్నింటిని అక్క‌డిక‌క్క‌డే ప‌రిష్క‌రించ‌గా .. మ‌రి కొన్నింటిని ప‌రిష్క‌రిస్తాన‌ని హామీ ఇచ్చారు.


చినబొండపల్లిలో నియోజకవర్గ నాయకులు, కార్యకర్తలతో సమన్వయ సమావేశం అనంతరం పార్వతీపురం నియోజకవర్గ ఎమ్మెల్యే బోనెల విజయచంద్ర నేతృత్వంలో ఈ వేడుకలు జరిగాయి. మంత్రి నారా లోకేష్ కేక్ కట్ చేసి ఎమ్మెల్యే విజయచంద్రకు తినిపించారు. నందమూరి బాలకృష్ణ గారికి అడ్వాన్స్ డ్‌ బర్త్ డే విషెస్ తెలిపారు. ఈ కార్యక్రమం లో శాప్ ఛైర్మన్ అనిమిని రవినాయుడు, నియోజకవర్గ నేతలు, కార్యకర్తలు, బాలకృష్ణ గారి అభిమానులు పెద్దఎత్తున పాల్గొన్నారు. ఇక బాల‌య్య పుట్టిన రోజు సంద‌ర్భంగా ఆయ‌న న‌టిస్తోన్న రెండు సినిమాల నుంచి అదిరే అప్ డేట్లు వ‌చ్చాయి. అఖండ 2 తాండ‌వం టీజ‌ర్ తో పాటు మలినేని గోపీచంద్ ద‌ర్శ‌కత్వం లో బాల‌య్య న‌టించే 111వ సినిమా అప్‌డేట్ వ‌చ్చింది.


వాట్సాప్ నెంబ‌ర్‌కు మీ జిల్లాలో రాజ‌కీయ‌, సామాజిక స‌మ‌స్య‌లు వివ‌రాలు పంపండి..

ఏపీ, తెలంగాణ‌లో వివిధ నియోజ‌క‌వ‌ర్గాల్లో నెల‌కొన్న ప్ర‌జ‌ల స‌మ‌స్య‌లు, రాజ‌కీయ ప‌ర‌మైన అంశాల‌ను మా దృష్టికి తీసుకు రావాల‌నుకుంటున్నారా ?  మీ స‌మ‌స్య లేదా మీరు చెప్పే విషయం ఏదైనా క్లుప్తంగా 9490520108 నెంబ‌రుకు వాట్సాప్ ద్వారా తెలియ‌జేయండి.

నోట్ :  వ్య‌క్తిగ‌త స‌మ‌స్య‌లు వ‌ద్దు

మరింత సమాచారం తెలుసుకోండి: