టిడిపి పార్టీకి చంద్రబాబు తర్వాత పార్టీ పగ్గాలు ఎవరి చేతికి వెళ్తాయని, అలాగే సీఎంగా నారా లోకేష్ ఎప్పుడు అవుతారనే ప్రశ్న అటు నేతలలో కార్యకర్తల్లో ఇప్పటికీ ఉన్నది. ఈ విషయంపై ఎన్నోసార్లు సీఎం చంద్రబాబును కూడా అడిగిన సందర్భాలు ఉన్నాయి. ఈ విషయంపై ఎన్నోసార్లు చంద్రబాబు మాట్లాడకుండా దాటివేశారు.మరి కొంతమంది నేతలు డైరెక్ట్ గానే లోకేష్ మాకు కాబోయే సీఎం అంటూ తమ పార్టీని ముందుకి నడిపించే నాయకుడు అంటూ తెలియజేస్తూ ఉన్నారు. తాజాగా లోకేష్ సీఎం  అవ్వడంపై పలు విషయాలు తెలియజేసినట్లు తెలుస్తోంది. వాటి గురించి చూద్దాం


ఇటీవలే ఒక జాతీయ ఛానల్ కు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఈ ప్రశ్న చంద్రబాబుకు ఎదురయ్యింది.. నారా లోకేష్ ను ఎప్పుడు టిడిపి ప్రెసిడెంట్గా ఎన్నిక చేస్తారు?. 2029 లో లోకేష్ సీఎంగా చేస్తారా అంటూ చంద్రబాబును ప్రశ్నించగా.. అందుకు చంద్రబాబు ఇలా జవాబు ని ఇస్తూ.. టిడిపి తో పాటు ప్రజల మద్దతు కూడా పూర్తిగా ఉన్నదని.. దేశంలో యువత ఎక్కువగా ప్రోత్సహించే పార్టీలలో టిడిపి పార్టీని ముందు వరుసలో ఉందని.. నారా లోకేష్ సీఎం అవుతారనే విషయంపై ఇప్పుడు ఏమి చెప్పలేనని.. తనకు అంత సామర్థ్యం అయితే ఉంది.. కానీ దాన్ని నిరూపించుకోవలసి ఉంటుంది. పార్టీలో నుంచి ఎవరైనా సరే నాయకుడిగా ఆవిర్భవించొచ్చు అంటూ  సీఎం చంద్రబాబు తెలియజేశారు.


అటు చంద్రబాబు మాట్లాడిన మాటలు ఒకవైపు నారా లోకేష్ కి సపోర్ట్ చేస్తూ ఉన్నట్టు కనిపిస్తున్న మరొకవైపు ఇంకా సమయం ఉంది అన్నట్టుగా వ్యవహరిస్తున్నారు. మరి కొంతమంది మాత్రం జూనియర్ ఎన్టీఆర్ వ్యవహారాన్ని కూడా తెరమీదకి తీసుకు వస్తున్నట్లు టిడిపిలో వార్తలు వినిపిస్తున్నాయి. గతంలో కూడా చాలామంది ఈ విషయంపై ఏకీభవించిన సందర్భాలు కూడా ఉన్నవి. రాబోయే రోజుల్లో కూటమిలో టిడిపిలో ఇలాంటి నిర్ణయాలు తీసుకుంటారో చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి: