
భూమి చౌహాన్ అనే మహిళ భర్తతో కలిసి లండన్ లో నివసిస్తోంది. దాదాపు రెండేళ్ల అనంతరం ఇటీవలె లండన్ నుండి ఆమె ఇండియాకు వచ్చారు. తిరిగి లండన్ కు వెళ్లేందుకు భూమి చౌహాన్ రెడీ అయింది. అందులో భాగంగానే గురువారం అహ్మదాబాద్ నుంచి లండన్ వెళ్లాల్సిన ఎయిర్ ఇండియా AI-171 విమానంలో టికెట్ బుక్ చేసుకుంది. కానీ భూమి చౌహాన్ ప్రయాణిస్తున్న కార్ ట్రాఫిక్‌లో చిక్కుకుపోవడంతో సరైన టైమ్‌కి ఆమె ఎయిర్‌పోర్ట్‌కు రీచ్ కాలేకపోయింది. పది నిమిషాలు ఆలస్యంగా వెళ్లడంతో ఫ్లైట్ మిస్ అయింది.
ఆ పది నిమిషాల ఆలస్యమే తన ప్రాణాలు కాపాడిందని.. విమాన ప్రమాదం గురించి తెలిసినప్పటి నుంచి తన శరీరం వణుకుతూనే ఉందని.. ఇప్పటికీ సరిగ్గా మాట్లాడలేకపోతున్నానని భూమి చౌహాన్ సోషల్ మీడియా వేదికగా ఎమోషనల్ అయింది. `నేను మిస్ అయిన ఫ్లైట్ క్రాష్ అయిందన్న విషయం తెలియగానే నా మైండ్ పూర్తిగా బ్లాంక్ అయింది.. నా గణపతే నన్ను కాపాడు. ఫ్లైట్ మిస్ అయ్యాక మధ్యాహ్నం 1:30 గంటల ప్రాంతంలో సర్దార్ వల్లభాయ్ పటేల్ అంతర్జాతీయ విమానాశ్రయం నుంచి నేను బటయకు వచ్చాను. మధ్యాహ్నం 1:38 గంటలకు ఎయిర్ ఇండియా విమానం టేకాఫ్ అయ్యి.. కొద్దిసేపటికే ఓ నివాస ప్రాంతంలో కుప్పకూలింది. ప్రాణనష్టం గురించి తలుచుకుంటే చాలా బాధ కలుగుతుంది` అంటూ భూమి చౌహాన్ ఉద్వేగానికి గురైంది.