
అలాగే తన రాజకీయ జీవితాన్ని నాశనం చేయడానికి ఇలా చేశారని షర్మిల సంచలన ఆరోపణలు చేశారు .. అయితే తనతో రాజకీయంగా కలిసి వచ్చే వాళ్ల గురించి , అలాగే ఆర్థికంగా సాయం చేసే వారి గురించి ఈ ట్యాపింగ్ ద్వారా తెలుసుకుని వారిని భయపెట్టారని .. అలాగే తనను రాజకీయంగా బలహీన పరిచారని ఆమె ఆరోపించారు .. అలాగే ట్యాపింగ్ బాధితురాలి గా తాను ఎక్కడికి వచ్చి అయినా ఎలాంటి స్టేట్మెంట్ ఇవ్వడానికైనా సిద్ధమని ప్రకటించారు ..
ఇక అప్పట్లో జగన్ రెడ్డికి , కెసిఆర్ కు ఎంతో సన్నిహిత సంబంధం ఉందన్నారు .. అలాగే వారి మధ్య ఉన్న సంబంధం తో రక్తసంబంధం కూడా చిన్నదైపోయిందని షర్మిల సెటైర్ కూడా వేశారు .. అయితే షర్మిల ఆరోపణలు ఇప్పుడు ఆషామాషీగా లేవు. .. నేరుగా ఇందులో వై వి సుబ్బారెడ్డి పేరు చెప్పి ఆయనే తనకు ట్యాప్ జరుగుతున్నాయని చెప్పి ఆడియో క్లిప్ కూడా వినిపించారని ఆసల విషయాన్ని బయటపెట్టారు .. ఇక ఇప్పుడు సుబ్బారెడ్డి దాన్ని ఖండించాల్సి ఉంది .. మరి ఆయన ఖండిస్తారా లేక సైలెంట్ గా ఉంటారా అనేది వేచి చూడాలి ..