మన దేశంలో జనాభా రోజు రోజుకు పెరిగిపోతున్న విషయం మన అందరికీ తెలిసిందే. జనాభా భారీగా పెరుగుతున్న వేళ అనేక మంది బ్రతుకు తెరువు కోసం పట్టణాల్లోకి వచ్చేస్తున్నారు. దానితో గ్రామీణ ప్రాంతాల్లో కంటే పట్టణ ప్రాంత జనాభా రోజు రోజుకు విపరీతంగా పెరిగిపోతూ వస్తుంది. దానితో రద్దీ విపరీతంగా పెరిగిపోతుంది. పట్టణ ప్రాంతాల్లో జనాభా ఎక్కువ నివసించడం వల్ల రోడ్లపై ట్రాఫిక్ భారీగా పెరిగిపోతుంది. ఎక్కడైనా కాస్త ట్రాఫిక్ సిగ్నల్ పడితే చాలు కిలో మీటర్ల మేర ట్రాఫిక్ జామ్ అయిపోతుంది. ఇలా భారీగా ట్రాఫిక్ జామ్ అవుతుంది అనే నేపథ్యంలోనే దేశంలోని ప్రధాన నగరాల్లో ఇప్పటికే మెట్రో సదుపాయాలను తీసుకువచ్చారు.

మెట్రో సదుపాయాలు ఉన్నా కూడా ట్రాఫిక్ ఇబ్బందులు ఏమీ తప్పడం లేదు. దానితో కేంద్ర ప్రభుత్వం మరో కొత్త ఆలోచనకు శ్రీకారం చుట్టినట్లు తెలుస్తోంది. దేశం లోని ప్రధాన నగరాల్లో ఫ్లయింగ్ బస్ సౌకర్యాలను తీసుకురావాలి అనే ఆలోచన చేస్తున్నట్లు తెలుస్తోంది. మెట్రో రైల్ మాదిరిగా ఎలివేటెడ్ ట్రాక్ పై ఈ బస్సులు నడిచే విధంగా ప్లాన్ చేయబోతున్నట్లు తెలుస్తోంది. అదే విధంగా ఈ బస్సులను ఎలక్ట్రిక్ సదుపాయంతో నడిచే విధంగా తీసుకువచ్చే ప్రతిపాదనలు చేస్తున్నట్లు తెలుస్తోంది. ఎలక్ట్రిక్ సదుపాయంతో ఎలివేటెడ్ ట్రాక్ పై బస్సులు నడిచినట్లయితే ట్రాఫిక్ తగ్గడం మాత్రమే కాకుండా కాలుష్యం కూడా భారీగా తగ్గుతుంది అని , అలాగే ఖర్చు కూడా భారీగా తగ్గుతుంది అని కేంద్ర ప్రభుత్వం ఈ ఆలోచన వైపు మొగ్గు చూపుతున్నట్లు తెలుస్తోంది.

ఇక ఎలివేటెడ్ ట్రాక్ పై నడిచే ఎలక్ట్రిక్ బస్సు , బస్ స్టేషన్లో ఆగిన ఆర నిమిషంలోనే చార్జింగ్ చేసుకోనున్నట్లు , దానితో దాదాపు 40 కిలో మీటర్లు మేర ప్రయాణించే విధంగా టెక్నాలజీ ఉన్నట్లు కూడా తెలుస్తుంది. ఒక వేళ ఈ బస్సులు కనుక మన దేశంలోని ప్రధాన నగరాల్లోకి వచ్చినట్లయితే మన దేశం లోని ప్రధాన నగరాల్లో ట్రాఫిక్ భారీగా తగ్గే అవకాశాలు ఉన్నాయి అని , అలాగే కాలుష్యం కూడా తగ్గే అవకాశం ఉంది అని అనేక మంది అభిప్రాయ పడుతున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: