ఇక జూన్ 12 అహ్మదాబాద్ లో జరిగిన ఘోర విమాన ప్రమాదం తర్వాత ఎయిరిండియా ఎప్పుడు వార్తల్లో నిలుస్తున్న విషయం తెలిసింది .. అయితే ఈ క్రమంలోనే తాజాగా ఎయిరిండియా ఒకీలక నిర్ణయం తీసుకోబోతున్నట్లు తెలుస్తుంది .. ఇందులో భాగంగా .. వైట్ బాడీ విమానాలపై అంతర్జాతీయ సేవలను 15% తగ్గించునుంది .. ఈ మేరకు సౌరభ్ సిన్హా నివేదించారు . ఎస్ ఎయిరిండియా వైట్ బాడీ విమానాలపై అంతర్జాతీయ సేవలను 15% తగ్గిపోవనున్నాయి ఇది జులై మధ్యకాలం వరకు తక్షణమే అమల్లోకి రానుందని సౌరభ్ సిన్హా చెప్పుకొచ్చారు ..


వైట్ బాడీ బోరింగ్ విమానాల్లో మరింతగా రక్షణ తనిఖీలు చేపట్టనున్నామ‌ని .. అలాగే అదనపూ  జాగ్రత్తల కోసం ఇలాంటి చర్యలు తీసుకుంటున్నట్లు ఎయిరిండియా చెప్పుకొస్తుంది. అలాగే ఈ తగ్గింపు కారణంగా ఎఫెక్ట్ అవుతున్న ప్రయాణికులకు ఎయిరిండియా క్షమాపణ కూడా చెబుతుంది .. ఈ క్రమంలో ప్రయాణికులు ఎలాంటి ఖర్చు లేకుండా వారి ప్రయాణాన్ని రీ షెడ్యూల్ చేసుకునే లేదా డబ్బులు వాప‌స్‌ తీసుకొనే అవకాశాన్ని కూడా అందిస్తున్నట్లు చెప్పుకొస్తుంది .. ఇక ఈ కొత్త షెడ్యూల్ జూన్ 20 2025 నుంచి అమల్లోకి రాబోతుందని తెలుస్తుంది . ముఖ్యంగా కార్యచరణ స్థిరత్వాన్ని పునరుద్దించడానికి ప్రయాణికులకు చివ‌రి నిమిషంలో  కలిగే అసౌకర్యాన్ని తగ్గించడానికి ఇది స‌హ‌య‌ప‌డుతుంద‌ని ..


అలాగే ప్రయాణికులు పౌర విమానయ మంత్రిత్వ శాఖ , భారతదేశ మద్దతుతో తాము ఈ విషాద సంఘటన నుంచి మరింత బలంగా బయటపడతామని .  అలాగే ప్రయాణికులకు తమ సేవలో విశ్వాసాన్ని తిరిగి తెప్పించగలుగుతామని చెప్పుకొస్తుంది  . అయితే ఇటీవల ఎయిరిండియా బోయింగ్ 787 -8/9 విమానాల్లో మెరుగైన భ‌ద్ర‌త తనిఖీని డైరెక్టర్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్ (డీజీసీఏ) తప్పనిసరి చేసిన విషయం తెలిసింది .. ఈ క్రమంలో మొత్తం 33 విమానాలలోను ఇప్పటికే 26 విమానాలు తనిఖీలు పూర్తయ్యాయని  ఎయిరిండియా చెప్పుకొచ్చింది మిగిలినవి కూడా త్వరలో పూర్తవుతాయని అంటుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: