జూబ్లీహిల్స్ ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్ ఈ మధ్యకాలంలో గుండెపోటుతో మరణించారు. దీంతో ఈ నియోజకవర్గంలో బై ఎలక్షన్స్ జరగబోతున్నాయి. మరి ఈ ఎలక్షన్స్ లో  అన్ని పార్టీలు గెలుపు కోసం ప్రయత్నాలు చేస్తున్నాయి.ఇదే తరుణంలో బిజెపి మరోవైపు బీఆర్ఎస్ ఇంకోవైపు ఎంఐఎం పార్టీలు పోటీ కోసం తహతలాడుతున్నాయి. ఇదంతా జరుగుతున్న తరుణంలోనే టిడిపి కూటమి తరపున కూడా ఈసారి జూబ్లీహిల్స్ లో  పోటీ చేయబోతున్నారనే వార్తలు వినిపిస్తున్నాయి. ముఖ్యంగా ఈ ప్రాంతంలో హరికృష్ణ కూతురునందమూరి సుహాసిని పోటీ చేస్తున్నట్టు తెలుస్తోంది. ఇదే తరుణంలో గెలుపు అవకాశాలు ఎవరికి ఉండబోతున్నాయి అనే వివరాలు చూద్దాం.. ముఖ్యంగా జూబ్లీహిల్స్ లో ఎక్కువగా ముస్లిం ఓటు బ్యాంకు ఉంటుంది. అంతేకాకుండా ఎక్కువమంది ఏపీ నుంచి వచ్చిన వారే ఇక్కడ సెటిల్ అయిపోయి ఉన్నారు.

 ఈ క్రమంలోనే టిడిపి కూటమి తరఫున సుహాసినిని బరిలోకి దింపితే తమ సామాజిక వర్గం ఓట్లు, అలాగే ఏపీకి సంబంధించిన చాలా మంది ఇక్కడే సెటిల్ అయిపోయారు. వారి ఓట్లతోపాటు జనసేన మెగా అభిమానుల ఓట్లు వారికి ప్లస్ అయ్యే అవకాశం ఉంది. అంతేకాకుండా మిడిల్ లో ఉన్నటువంటి బిజెపి హిందుత్వ వాదంతో మరికొన్ని ఓట్లు సంపాదించే అవకాశం అయితే కనిపిస్తోంది. అంతేకాకుండా  కాంగ్రెస్,ఎంఐఎం సపరేట్ గా పోటీ చేస్తే మాత్రం తప్పకుండా  కూటమి ప్రభుత్వానికే ప్లస్ అయ్యే అవకాశం కనిపిస్తోంది. ఒకవేళ ఎంఐఎం,కాంగ్రెస్ కలిసి పోటీ చేస్తే మాత్రం తప్పకుండా అక్కడ కాంగ్రెస్ కు ఎక్కువగా ప్లస్ అయ్యే అవకాశం కనిపిస్తోంది. ఎందుకంటే ముస్లిం ఓటు బ్యాంకు ఎక్కువగా ఉంటుంది.ఆ ఓటు బ్యాంకుతో పాటు కాంగ్రెస్ ఓట్లు కలిస్తే సగం కంటే ఎక్కువ ఓట్లు వీరికే వస్తాయి.

అలాగే బీఆర్ఎస్ పార్టీకి కూడా అక్కడ మంచి పరపతి ఉంది. కానీ మాగంటి గోపీనాథ్ మరణంతో సెంటిమెంట్ క్రియేట్ చేద్దామంటే ఆయన కుటుంబంలో విపరీతమైనటువంటి గొడవలు అవుతున్నాయి. గోపీనాథ్ అన్న ఆ టికెట్ కోసం ఆశిస్తున్నారు. తన భార్య కూడా టికెట్ కావాలని చూస్తోంది. ఇలా గోపీనాథ్ కుటుంబంలోనే ఒకరికొకరికి పడడం లేదు. సెంటిమెంట్ అక్కడ వర్కౌవుట్ అయ్యే అవకాశం చాలా తక్కువగా ఉంది. ఇలా అన్ని ఈక్వేషన్స్ చూస్తే ఓవైపు కూటమికి, మరోవైపు కాంగ్రెస్ కి ఇంకోవైపు బీఆర్ఎస్ మధ్య పోటీ ఉండబోతోంది. ఒకవేళ కాంగ్రెస్, ఎమ్ఐఎం కలిస్తే మాత్రం తప్పకుండా వారికి గెలుపు తీరాలకు వెళ్లే అవకాశం ఉంది. ఒకవేళ వీళ్ళు కలవకపోతే తప్పకుండా టిడిపి కూటమికి ప్లస్ అయ్యే అవకాశం కనిపిస్తోంది.

మరింత సమాచారం తెలుసుకోండి: