రెండు తెలుగు రాష్ట్రాల నీటి వాటాల ఒప్పందాలు, బనకచర్ల ప్రాజెక్టుపై చర్చించేందుకు ఎన్ని రోజులు కావాలంటే అన్ని రోజులు అసెంబ్లీ పెడదాము .. చర్చకు రావాలని రేవంత్ రెడ్డి  విసిరిన  సవాలకు కేటీఆర్ స్పందించారు .. 72 గంటల సమయం ఇస్తున్నాం మీరే ప్రిపేర్ అయి సామాజిగూడ ప్రెస్ క్లబ్ కు రావాలని కేటీఆర్ సీఎంకు రివర్స్ కౌంటర్ పిసిరారు .. అలాగే దానికి కూడా రేవంత్ రెడ్డి స్థాయికి కేసిఆర్ అవసరం లేదని .. తాము సరిపోతామని కేటీఆర్ అన్నారు .. దీన్నిబట్టి అసెంబ్లీకి రాము కెసిఆర్ కూడా హాజరుకారు అని కారు పార్టీ నేతలు ఒప్పేసుకున్నారు ..


అలాగే నీటి ఒప్పందాలపై చర్చించడానికి నిజాలు బయటపెట్టడానికి అసెంబ్లీ కన్నా సరైన ప్లేస్ మరొకటి ఉండదు .. అలాగే మన ప్రజాస్వామ్యంలో అసెంబ్లీని అన్నిటికన్నా ఎంతో కీలకమైనది .. చట్టసభలు కాకుండా బయట ఎక్కడ జరిగినా దానికి ఎలాంటి విలువ ఉండదు .. ఈ విషయం బీఆర్ఎస్ నేతలకు ప్రధానంగా కేటీఆర్ కు మంత్రిగా ఎమ్మెల్యేగా ఉన్నాడు కాబట్టి ఆయనకు తెలియనిది కాదు .. అయినా కూడా కేటీఆర్ ఎందుకు ప్రెస్ క్లబ్ లో చర్చకు సవాల్ చేశారు  కాంగ్రెస్ నాయకులకు ముఖ్యమంత్రి కి ఒక క్లారిటీ ఉంది .. అసెంబ్లీకి రావాలని తమ డిమాండ్ కాబట్టి .. దానికి పంగనామం పెట్టడానికి ఇలా వారు ప్లాన్ చేశారని అంటున్నారు .



అలాగే జల ఒప్పందంలో కేసీఆర్ తీసుకున్న నిర్ణయాలను తీరును రేవంత్ రెడ్డి బట్టబయలు పెడుతున్నారు .. ప్రధానంగా కృష్ణా జలాల విషయంలో ఆయన చేసుకున్న 299 టీఎంసీల ఒప్పందం గురించి .  అలాగే గోదావరి జ‌లాలను రాయలసీమకు తరలించడం పై కేసీఆర్ గతంలో చేసిన ప్రకటన పైన కూడా బలంగా ప్రజల్లోకి వెళ్లేలా రేవంత్ కుండ బద్దలు కొట్టే విధంగా చెబుతున్నారు .  ఈ క్రమంలోనే ఒత్తిడికి గురవుతున్న గులాబీ పార్టీ .. ముఖ్యమంత్రి గా ఉంటూ రేవంత్ అబద్ధాలు చెబుతున్నారని గగోలు పెడుతుంది .. నిజాలు ఏమిటో మాత్రం వారు బయట పెట్టలేకపోతున్నారు .  ఇలా మొత్తంగా జల వివాదంలో అన్ని విధాలుగా ముఖ్యమంత్రిగా రేవంత్ అడ్వాంటేజ్ సాధిస్తున్నట్లుగా కనిపిస్తున్న విషయాలు చెబుతున్నాయి .

మరింత సమాచారం తెలుసుకోండి: