
ఇదే సమయంలో, దక్షిణాది రాష్ట్రాల్లో బీజేపీ కి ప్రత్యక్షంగా గట్టి వ్యతిరేకత కనిపించడం లేదు . తెలుగు రాష్ట్రాల్లో టిడిపి , జనసేన లాంటి కూటమి పార్టీల తో మైత్రి వాతావరణం ఏర్పడింది . తమిళనాడు , కర్ణాటక లోనూ వ్యూహాత్మకం గా బలపడేందుకు ప్రయత్నాలు ముమ్మరం చేశారు . ప్రస్తుతం దక్షిణాదికి కేంద్ర ప్రభుత్వం ద్వారా ప్రవేశపెడుతున్న ప్రాజెక్టులు , నిధుల కేటాయింపులు బీజేపీ కి రాజకీయంగా మేలు చేసే అవకాశంగా మారుతున్నాయి . ఆంధ్రప్రదేశ్ , తెలంగాణ , తమిళనాడు , కర్ణాటక వంటి రాష్ట్రాలలో అభివృద్ధికి పెరుగుతున్న మద్దతు – ప్రజల్లో నచ్చుబాటు పెరగడానికే సూచికగా చూడవచ్చు .
ఇక 2024 సార్వత్రిక ఎన్నికల్లో టిడిపి - జనసేన మద్దతుతో కేంద్రంలో మళ్లీ అధికారం చేపట్టిన బీజేపీ , ఇదే ఫార్ములాను 2029 వరకు కొనసాగించేందుకు యత్నిస్తోంది. ఇప్పటికే "ఆపరేషన్ లోటస్" కార్యకలాపాలు మళ్లీ ప్రారంభమయ్యాయని విశ్లేషకుల అభిప్రాయం. బీజేపీ దక్షిణాది పై చూపిస్తున్న తాజా ఆసక్తి - ఆ పార్టీ భవిష్యత్తు వ్యూహాన్ని సూచిస్తుంది . ఇది కేవలం పదవుల రాజకీయంగా కాకుండా , బలమైన రాజకీయ పునాది ఏర్పాటుకు ఉద్దేశించిన యత్నంగా భావించాల్సి ఉంది .