తిరుపతి జిల్లా శ్రీకాళహస్తి నియోజకవర్గం లో జనసేన పార్టీకి చెందినటువంటి కార్యకర్త హత్య అవ్వడం ఒక్కసారిగా కలకలాన్ని సృష్టిస్తోంది. ఈనెల 8వ తేదీన శ్రీనివాసులు (రాముడు) వ్యక్తి మృతదేహం చెన్నైలోని కూవం నది సమీపంలో పోలీసులు గుర్తించారు. అతని చేతి మీద జనసేన పార్టీ సింబల్ తో పాటుగా వినుత అనే పేరు కూడా ఉండడం పోలీసులు గుర్తించడం జరిగింది. దీంతో ఈనెల 8వ తేదీన రాముడు హత్య చేసి మరి నదిలో పడేసారన్నట్లుగా తెలియజేశారు. దీంతో కొంతమంది నిందితులను పోలీసులు అనుమానిస్తున్నారు.


చెన్నై పరిధిలో ఉండే మింట్ పోలీస్ స్టేషన్లో ఈ కేసు నమోదు కాగా.. పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.ఈ కేసులో శ్రీకాళహస్తి జనసేన పార్టీకి సంబంధించి వినుత , అతని భర్త చంద్రబాబుతో సహా మరో ఐదు మందిని చెన్నై పోలీసులు అరెస్టు చేశారు. వీరందరినీ కూడా చెన్నై నుంచి శ్రీకాళహస్తికి సైతం తీసుకువచ్చి మరి విచారణ చేస్తున్నారట. రాముడి హత్య కేసులో వినుత అరెస్టు చేయడం ఒక సంచలనంగా మారింది. కోట వినుతకు డ్రైవర్ గా పనిచేస్తున్నారట.అంతేకాకుండా ఆమెకు మాజీ వ్యక్తిగత సహాయకుడిగా కూడా ఉండేవారట.


హత్య కేసులో వీరి పేరు వినిపించడంతో దీంతో జనసేన పార్టీ నుంచి ఈమెను సస్పెండ్ చేసినట్లుగా తెలుస్తోంది. శ్రీకాళహస్తి  నియోజకవర్గానికి సంబంధించి ఇన్చార్జిగా ఉన్న శ్రీమతి వినుత వ్యవహార శైలి కూడా పార్టీలకు భిన్నంగా ఉండడంతో పాటకు గత కొంతకాలంగా పార్టీ కార్యక్రమాలకు కూడా దూరంగా ఉన్నది. ఇలాంటి సమయంలో చెన్నైలో హత్య కేసు నమోదు అవ్వడంతో ఈ విషయం పార్టీ దృష్టికి రావడంతో ఈమెను పార్టీ నుంచి బహిష్కరించారు. అందుకు సంబంధించి జనసేన నుంచి ఒక ప్రకటన కూడా వెలువడింది.


రెండు వారాల క్రితమే డ్రైవర్ రాముడును కూడా తొలగించామని అతనికి జనసేన పార్టీతో తమకు ఎలాంటి సంబంధం లేదని విడుదల చేశారు. కూటమినేతలతో రాముడు కలిసి కుట్రలు చేస్తున్నారంటూ.. అటు వినుత, ఆమె భర్త చంద్రబాబు ఆరోపణలు చేశారు. కానీ ఈ నేపథ్యంలోని మూడు రోజుల క్రితం చెన్నైలో శివమై కనిపించడంతో రకరకాల రూమర్స్ వినిపిస్తున్నాయి. తిరుపతిలో జనసేన అభ్యర్థి అయిన శ్రీనివాసులు విజయానికి ఇమే చాలా కష్టపడి పని చేశారు.. మరి ఇలాంటి సమయంలో ఇలాంటివి జరగడం ఎక్కడికి దారితీస్తాయో చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి: