
తల్లిదండ్రుల వేదన .. రూ.8.6 కోట్ల వరకు సిద్ధం ... నిమిషా తల్లి ప్రేమకుమారి, గత సంవత్సరం యెమెన్ వెళ్లి బాధితుడు తలాల్ అబ్దో మహ్దీ కుటుంబాన్ని ఒప్పించే ప్రయత్నం చేశారు. రూ.8.6 కోట్ల పరిహారం ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నారు. కానీ ఇప్పటి వరకూ బాధిత కుటుంబం అంగీకారం తెలపలేదు. మత పెద్దలు రంగంలోకి .. ఇప్పుడు భారత ముస్లింల మత గురువు ఏపీ అబూబకర్ ముస్లియార్ సహా యెమెన్ మత పెద్దలు, స్థానిక అధికారులు బాధిత కుటుంబాన్ని ఒప్పించేందుకు చర్చలు జరుపుతున్నారు. “ఇప్పటికి ఇది ఒక్కటే మార్గం” అని నిమిషా న్యాయవాది సుభాష్ చంద్రన్ వెల్లడించారు.
భారత ప్రభుత్వ పరిమితులు .. భారత ప్రభుత్వం కొన్ని ప్రయత్నాలు చేసినప్పటికీ, భారత-యెమెన్ మధ్య ప్రస్తుతం బలమైన దౌత్య సంబంధాలు లేకపోవడం వల్ల ప్రభుత్వ సర్వోన్నత స్థాయిలో ఉపయోగపడటం లేదు. బ్లడ్ మనీని భారత ప్రభుత్వం అధికారికంగా చెలామణి చేయలేని పరిస్థితి ఉండటంతో కేంద్రం కొంత దూరంగా ఉంది. ఊరటిచ్చిన తాజా వార్త .. అయితే నిమిషా ప్రియకు ఊరటనిచ్చే వార్త విన్నివ్వడం యెమెన్ ప్రభుత్వానికి దగ్గరగా ఉన్న వర్గాలు తెలియజేశాయి. ఆమెకు అమలవాల్సిన ఉరిశిక్షను తాత్కాలికంగా వాయిదా వేశారు. ఈ నిర్ణయం భారత విదేశాంగ శాఖకు సమాచారం చేరినట్లు తెలుస్తోంది. ఇక ప్రశ్న ఒకటే: బ్లడ్ మనీ అంగీకారంతో నిమిషా ప్రియ ఉరిశిక్ష రద్దవుతుందా ? లేక ఇది తాత్కాలిక ఊరట మాత్రమేనా ? దేశం మొత్తం ఆశగా ఎదురుచూస్తోంది.