ఈ మధ్య కాలంలో అమ్మాయిలపై వేధింపులు ఊహించని స్థాయిలో పెరుగుతున్నాయి. సోషల్ మీడియా వినియోగం ఊహించని స్థాయిలో పెరిగిన నేపథ్యంలో ఫేక్ ఐడీలతో అమ్మాయిలపై వేధింపులకు పాల్పడుతున్న వాళ్ళ సంఖ్య అంతకంతకూ పెరుగుతోంది. తాజాగా ప్రముఖ కంపెనీకి సంబంధించిన గూగుల్ మీట్ లో ఏకంగా టీమ్ లీడ్ పై గుర్తు తెలియని ఐడీతో ఒక వ్యక్తి మీటింగ్ లో జాయిన్ అయ్యి ఇష్టానుసారం కామెంట్లు చేశారు.

అమ్మాయి పోలీసులకు ఫిర్యాదు చేసిన తర్వాత కూడా ఆ వేధింపులు కొనసాగాయంటే   మహిళల భద్రత విషయంలో చట్టాలను  మరింత బలపరచాల్సిన అవసరం అయితే ఉంది.  మరి కొందరు  అమ్మాయిలకు  సోషల్ మీడియాలో ప్రేమ పేరుతో  వేధింపులు తప్పడం లేదు.  కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు  మహిళలకు ఈ తరహా  అనుభవాలు ఎదురైతే సులువుగా ఫిర్యాదు చేసే అవకాశాన్ని కల్పించాల్సి ఉంది.

తప్పులు చేస్తున్న వాళ్లకు కఠిన  శిక్షలు విధించేలా  మరొకరు ఈ తప్పులు  చేయకుండా  ఉండేలా చర్యలు తీసుకొనిరావాల్సి ఉంది.  పోలీసులు సైతం, సైబర్ క్రైమ్ నిపుణులు  సైతం ఈ తరహా  ఫిర్యాదుల విషయంలో వేగంగా  స్పందిస్తే  బాధితులకు సత్వర న్యాయం  జరుగుతుంది.  మాట్లాడటానికి,  రాయడానికి వీలు లేని భాషలో  సందేశాలు పంపే  అకౌంట్లను  శాశ్వతంగా బ్లాక్ చేసేలా  చర్యలు చేపట్టాల్సిన  అవసరం అయితే ఉంది.

ఉన్నత స్థాయిలో పని చేసే వాళ్ళకే  ఇలాంటి పరిస్థితి ఉంటే   సాధారణ  మహిళల పరిస్థితి ఏ విధంగా ఉంటుందో  అర్థమవుతుంది.  నిత్య జీవితంలో  మెజారిటీ అమ్మాయిలు  ఈ  తరహా ఇబ్బందులను  ఎదుర్కొంటున్నారు.  ఈ తరహా  ఘటనలు, అనుభవాలు ఎదురైనా కొంతమంది ఫిర్యాదు  చేయడానికి సైతం వెనుకడుగు వేస్తున్నారు. కనీసం ఫిర్యాదు చేసిన బాధితులకు అయినా న్యాయం జరిగితే  పోలీస్  స్టేషన్, కోర్టులపై సామాన్యుల్లో నమ్మకం మరింత పెరుగుతుంది. రాబోయే రోజుల్లో  ఈ పరిస్థితుల్లో మార్పు రావాలని ఆశిద్దాం.

మరింత సమాచారం తెలుసుకోండి: