ఆంధ్రప్రదేశ్ , తెలంగాణ కలిసి ఉన్న సమయంలో తెలుగుదేశం పార్టీలో అత్యంత కీలక నేతగా కొనసాగిన వారిలో రేవంత్ రెడ్డి ఒకరు. ఈయన చంద్రబాబు నాయుడుకి ఎంతో సన్నిహితంగా మెలిగాడు. దానితో ఈయన తెలుగుదేశం పార్టీలో కూడా మంచి స్థానానికి చేరుకున్నాడు. ఇక ఆంధ్రప్రదేశ్ రెండుగా విడిపోయిన తర్వాత తెలుగుదేశం పార్టీ ఉనికి కూడా తెలంగాణ రాష్ట్రంలో లేకుండా పోయింది. దానితో రేవంత్ రెడ్డి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం రెండుగా విడిపోయిన తర్వాత కూడా కొంత కాలం తెలుగుదేశం పార్టీలో కొనసాగాడు. ఆ తర్వాత ఆయన కాంగ్రెస్ పార్టీలోకి వెళ్ళాడు. ఇకపోతే కాంగ్రెస్ పార్టీలో ఈయన క్రియాశీలకంగా పని చేసి అంచలంచెలుగా ఎదిగి ఏకంగా తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి అయ్యాడు. ఇక ఈయన ముఖ్యమంత్రి కావడంతో ఒక సమయంలో తెలుగుదేశం పార్టీలో ఈయన అత్యంత కీలక నేతగా కొనసాగడం చంద్రబాబు నాయుడుకి అత్యంత సన్నిహితుడిగా ఉండడంతో అనేక సందర్భాలలో బీఆర్ఎస్ కు సంబంధించిన నేతలు చంద్రబాబు నాయుడు , రేవంత్ రెడ్డి ఇద్దరు మంచి స్నేహితులు. దాని వల్ల తెలంగాణకు అన్యాయం ఆంధ్రప్రదేశ్ కి న్యాయం జరిగే అవకాశాలు ఉన్నాయి అని వారు కామెంట్స్ చేసిన సందర్భాలు కూడా ఉన్నాయి.

ఇకపోతే తాజాగా చంద్రబాబు కుమారుడు ఆంధ్ర ప్రదేశ్ మంత్రి అయినటువంటి లోకేష్ ను జూబ్లీహిల్స్ ఎన్నికల కోసం కేటీఆర్ కలిశాడు అని , ఆయనతో భోజనం చేశాడు అని ఓ వార్త వైరల్ అవుతుంది. దీనితో కొంత మంది తెలుగుదేశం వారు కేటీఆర్ , లోకేష్ ను జూబ్లీహిల్స్ ఎన్నికలలో మద్దతు కోసం కలిసిన ఆయన మాత్రం ఎన్నికల విషయంలో మద్దతు తెలపలేదు అని చెబుతూ ఉంటే , రేవంత్ రెడ్డి , కేటీఆర్ , లోకేష్ ను కలిసి అతనితో భోజనం కూడా చేశాడు అని  , అలాగే డిన్నర్ మీటింగ్ కూడా చేశాడు అని కామెంట్ చేశాడు. ఇక దీనిపై కేటీఆర్ స్పందిస్తూ ... నేను లోకేష్ ను కలవలేదు. కలిసిన తప్పేమీ లేదు. ఆయన నాకు మంచి స్నేహితుడు. ఆయన మంచి రాజకీయవేత్త అంటూ చెప్పుకొచ్చాడు.

మరింత సమాచారం తెలుసుకోండి: