
వాస్తవికత విషయానికి వస్తే.. సప్లై తక్కువగా ఉంటే డిమాండ్ ఎక్కువగా ఉంటుంది.. ఒకవేళ డిమాండ్ ఎక్కువగా ఉంటే సప్లై తక్కువగా ఉంటుంది. ఇక డిమాండ్ కి, ధరకి లింక్ ఉంటుందన్న విషయం అందరికీ తెలిసిందే. ఇక ప్రస్తుత పరిస్థితి డిమాండ్ ఉంది కానీ చేతిలో డబ్బు ఉండడం లేదు. సప్లై ఉంది , దానిని కొనుగోలు చేసే డిమాండ్ ఉంది. కానీ డబ్బు లేదు. ఫలితంగా కొనుగోలు పడిపోయింది. ఆర్థిక పరిస్థితి అస్తవ్యస్తంగా మారిపోయింది. అందులో కాగ్ ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ ఆర్థిక సంక్షోభంలో మునిగిపోయింది అంటూ ఒక వార్తను వెల్లడించింది.
రెవెన్యూ రాబడులు గత ఏడాది 46, 112 కోట్లు ఉంటే.. ఈ ఏడాది 36,239 కోట్లు ఉంది. ఇందులో విశేషమేమిటంటే అంతకుముందు జగన్ సమయంలో రెవెన్యూ దెబ్బ తినలేదు కానీ ఇప్పుడు చంద్రబాబు టైమ్ లోనే మళ్లీ రెవెన్యూ దిగజారి పోతుందనే వార్తలు వినిపిస్తున్నాయి. అమ్మకపు పన్ను ఆదాయం 4733 నుంచి 4364 కోట్లకు పడిపోయింది. పన్నేతర ఆదాయం 1380 నుంచి 1269 కోట్లకు పడిపోయింది కేంద్ర గ్రాండ్లు 15, 699 కోట్ల నుండి 1465 కోట్లకు పడిపోయింది. సంక్షేమ పథకాలకు ఇచ్చే డబ్బులు 48, 976 కోట్ల నుండి 41,491 కోట్లకు పడిపోయింది. ఇకపోతే రెవెన్యూ పడిపోయినప్పటికీ సీఎం చంద్రబాబు సమయంలో ఈ రేంజ్ లో ఖర్చు పెట్టారనేది మామూలు విషయం కాదు అని చెప్పవచ్చు.. మొత్తానికైతే ఈ రేంజ్ లో రెవెన్యూ పడిపోవడంతో పథకాల సంగతి ఏంటి అని ప్రజలు కూడా కామెంట్లు చేస్తూ ఉండడం గమనార్హం.