
ఈ నేపథ్యంలోనే 15 ఏళ్లు పూర్తి అయిన పిల్లల ఆధార్ కార్డు బయోమెట్రిక్ అప్డేట్ కోసం స్కూళ్లు , కాలేజీల ద్వారా అమలు చేయాలని భావిస్తున్నట్లుగా సీఈవో భువనేశ్ కుమార్ వెల్లడించారు. ఇందుకోసం యూఐడిఏఐ నుంచి ఒక ప్రాజెక్టును కూడా ప్రారంభించబోతున్నట్లు యూఐడిఏఐ సీఈవో భువనేష్ కుమార్ వెల్లడించారు. ప్రస్తుతం ఎన్నో స్కూళ్లలో కూడా ఆధార్ కార్డు అనేది చాలా కీలకంగా మారింది. ప్రతి చిన్నారికి కూడా అవసరమైన ప్రయోజనాలు పొందాలి అంటే ఆధార్ కార్డు కచ్చితంగా ఉండాలి అంటూ తెలిపారు భువనేశ్ కుమార్.
అందుకే స్కూళ్లలో ఈ ఆధార్ కార్డు అప్డేట్ ప్రక్రియను కూడా ఈజీగా పూర్తి చేయాలనుకుంటున్నామంటూ తెలియజేశారు. ఈ ప్రాజెక్టు కింద కూడా ప్రతి జిల్లాకు ఒక బయోమెట్రిక్ మెషిన్లను పంపించి ప్రతి పాఠశాలలో కూడా ఆధార్ అప్డేట్ ప్రక్రియను కూడా అమలు చేయాలని చూస్తున్నట్లు తెలిపారు. ఇక ప్రతి స్కూళ్లకు వెళ్లి ఆధార్ బయోమెట్రిక్ అప్డేట్ చేయడానికి అవసరమైన టెక్నాలజీని కూడా పరిశీలిస్తున్నామని మరో రెండు నెలల లోపు ఇది సిద్ధమవుతుందంటూ తెలియజేశారు సీఈవో భువనేశ్ కుమార్.