వైసిపి పార్టీ అధికారంలో ఉన్నప్పుడు ఏపీ రాష్ట్రం శ్రీలంక అయిపోతుందంటూ విపక్ష పార్టీగా ఉన్న టిడిపి, జనసేన పార్టీలు చాలా విమర్శలు చేశాయి. కానీ ఇప్పుడు కూటమి ప్రభుత్వం ఏర్పడి ఏడాది పూర్తి అయ్యి రెండో ఏడాదిలోకి అడుగుపెట్టింది. ఈ నేపథ్యంలోనే మాజీ సీఎం జగన్ మోహన్ రెడ్డి తన ట్విట్టర్ నుంచి ఒక పోస్ట్ చేశారు. రాష్ట్ర ఆర్థిక పరిస్థితి పై కాగ్ నివేదికలను విడుదల చేస్తూ లెక్కలతో సహా ఈ ట్విట్ చేయడం జరిగింది.


ఆంధ్రప్రదేశ్ ఆర్థిక పరిస్థితి చాలా దారుణంగా దిగజారిపోయిందంటూ కాగ్ నివేదిక బేస్ చేసుకొని మాజీ సీఎం జగన్మోహన్ రెడ్డి ట్వీట్ చేశారు. ఈ ఆర్థిక సంవత్సరం 2025-26 తొలి త్రైమాషికంలో రాష్ట్ర ఆర్థిక పరిస్థితి మరింత దిగజారిపోయిందని.. కంట్రోల్ అండ్ ఆటర్ జనరల్ కాగ్ విడుదల చేసిన మంత్లీ కి ఇండికేటర్ ప్రకారం రాష్ట్ర ఆర్థిక స్థిరత్వం ప్రమాదకరమైన పరిస్థితులలో ఉందని.. రాష్ట్ర పునర్వ్యవస్థీకరణ  అనంతరం ఆర్థిక పరిస్థితి చాలా దారుణంగా మారి ఒక సవాల్ గా మారింది. సంక్షేమానికి ,అభివృద్ధికి ఎప్పుడైతే ప్రభుత్వం ఒకే ప్రాధాన్యత ఇచ్చి ఆ దిశలో వ్యయం చేస్తుందో అప్పుడే ప్రజలలో కొనుగోలు శక్తి పెరిగి పెట్టుబడులు కూడా పెరుగుతాయని తెలిపింది.


ఇవన్నీ కలిసి అన్ని రంగాలను అభివృద్ధి చేస్తాయి.. కానీ అంతులేని అవినీతి వల్ల రాష్ట్ర ఆదాయం చాలా దారుణంగా పడిపోయిందని.. మరొకవైపు అన్ని రంగాలలో పూర్తిగా తీరోగమనం కనిపిస్తోందని ఈ ఆర్థిక సంవత్సరం 2025-26 తొలి మూడు నెలలకు సంబంధించి చూస్తే.. పన్ను, పన్నేతర ఆదాయాలు కూడా పూర్తిగా తగ్గిపోయాయని కాగ్ తెలిపింది. గత ఎడాది ఇదే సమయంతో పోల్చి చూస్తే.. జిఎస్టి అమ్మకం పన్నుల ఆదాయం ఏ స్థాయిలో తగ్గిందనేది తాజాగా కాగ్ నివేదిక విడుదల చేసింది. ఈ ఏడాది తొలి త్రైమాసికంలో రాష్ట్ర ఆదాయంలో 3.47% ఇతర ఆదాయాలు కేంద్రం నుంచి వచ్చే నిధులు అన్ని కలిపి చూస్తే ప్రభుత్వ ఆదాయంలో మొత్తం 6.14% అభివృద్ధి మాత్రమే ఉందంటూ తెలిపింది. కానీ ఇదే సమయంలో రాష్ట్ర అప్పులు మాత్రం..15.61% పెరగడం చాలా దారుణమని.. రాష్ట్ర ప్రభుత్వం తమ ఖర్చుల కోసమే ఆదాయ మార్గాలపైన ఆధారపడకుండా కేవలం అప్పుల పైన ఆధారపడుతోందంటూ మాజీ సీఎం జగన్ కాగ్ నివేదికలను చూపిస్తూ ట్వీట్ చేశారు.

మరింత సమాచారం తెలుసుకోండి: