
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ.. డిపో పేరుతో పాటు స్త్రీ శక్తి ప్రయాణించే ప్రదేశం చేరాల్సిన గమ్యస్థానం వంటి అంశాలకు సంబంధించి ఈ టికెట్ పైన ముద్రించినట్లుగా కనిపిస్తోంది. మొత్తం టికెట్ ధర ప్రభుత్వ రాయతి చెల్లించాల్సింది అంటూ రూ.0.00 ముద్రించారు. దీంతో ఈ టికెట్ చూసిన మహిళల సైతం తెగ ఆనంద పడుతున్నారు. అయితే ఇందుకు సంబంధించి ఇంకా అధికారికంగా apsrtc విడుదల చేయవలసి ఉన్నది. ప్రభుత్వం ముద్రించినటువంటి ఏదైనా గుర్తింపు కార్డు ద్వారా మహిళలు రాష్ట్రంలో ఎక్కడి నుంచి అయినా కూడా ప్రయాణించవచ్చు అనే విధంగా తెలియజేసినట్లు సమాచారం.
ఇప్పటికే ఇందుకు సంబంధించి ఎన్నో సందర్భాలలో మంత్రులు నేతలు కూడా తెలియజేశారు. కానీ ఇప్పటివరకు ఉచిత బస్సు సంబంధించి విధివిధానాలను కూడా ఇంకా తెలియజేయలేదు. అయితే జిల్లాల వారికి పరిమితం చేస్తారా లేకపోతే రాష్ట్రమంతా ఉచిత బస్సు ప్రయాణం కల్పిస్తారా అనే విషయం ఇంకా సరైన క్లారిటీ రాలేదు.. ఆగస్టు 15వ తేదీన ఈ పథకాన్ని అమలు చేస్తూ అన్ని విషయాలను తెలియజేస్తారేమో చూడాలి మరి. చెప్పినట్టుగానే కూటమి ప్రభుత్వం కూడా మహిళలకు ఇచ్చిన హామీలను నెరవేరుస్తూ ఉన్నది.ఈ విషయంపై సీఎం చంద్రబాబు పైన కూడా ప్రశంసలు కురిపిస్తున్నారు మహిళలు. ఇక కేవలం ప్రతి నెల రూ.1500 రూపాయల పథకం మాత్రమే మిగిలి ఉన్నది ఈ పథకాన్ని కూడా త్వరలోనే అమలు చేస్తామంటూ తెలియజేస్తున్నారు.