
కానీ సప్తగిరి బస్సులలో ఈ ఉచిత ప్రయాణం ఉండదు అంటూ తెలిపారు. దీంతో మహిళలు కొంతమేరకు నిరాశకు గురవుతున్నారు. ఘాట్ రోడ్లలో ఉచిత ప్రయాణం ఉండదు అంటూ క్లారిటీ ఇవ్వడం జరిగింది.. ఏసీ బస్సులలో తప్ప మిగిలిన సర్వీసులలో మహిళలకు జీరో టికెట్ విధానం అమలు చేస్తామంటూ ఆర్టీసీ ఎండీ ద్వారకా తిరుమలరావు తెలియజేశారు. అలాగే మహిళలతో పాటుగా ట్రాన్స్ జెండర్స్ కు కూడా ఉచిత ప్రయాణం కలదు అంటు తెలియజేశారు.
మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం వల్ల 100 శాతం ఆక్యుఫెన్సీ సౌకర్యం పెరుగుతుందంటు ప్రభుత్వం అంచనా వేస్తోంది. రాబోయే రోజుల్లో మరిన్ని కొత్త బస్సులు కొనుగోలు చేసేందుకు కూడా ప్రభుత్వం సిద్ధమవుతున్నట్లు సమాచారం. మరి ఈ ఉచిత బస్సు ప్రయాణం వల్ల కూటమి ప్రభుత్వానికి కొంతమేరకు మైలేజ్ వచ్చే అవకాశం ఉన్నట్టుగా కనిపిస్తోంది. అయితే రాబోయే రోజుల్లో నిబంధనలతో ఈ ఉచిత బస్సు ప్రయాణం నడిపితే మాత్రం చాలా ఇబ్బందులు తలెత్తుతాయని చెప్పవచ్చు. ఇప్పటికే జిల్లాల వారీగా మాత్రమే అంటూ ఆంక్షలు పెట్టడంతో కొంతమేరకు మహిళలు కూడా నిరాశతో ఉన్నారు. మరి పూర్తి సమాచారం తెలియాలి అంటే ఆగస్టు 15 వరకు ఆగాల్సిందే. ఇప్పటికే ఏపీ ప్రభుత్వం ప్రజలకు చాలానే గుడ్ న్యూస్ లు తెలిపింది.