
అయితే ఈసారి పులివెందల మున్సిపాలిటీ ని ఎట్టి పరిస్థితులలో కూడా వైసిపి పార్టీకి దక్కకూడదనే ఆలోచనతో ముందుకు వెళ్తున్నారు.. అలా టిడిపి నియోజకవర్గ ఇన్చార్జి బీటెక్ రవి, లోకేష్ అందుకు తగ్గట్టుగా ప్లాన్ చేస్తున్నట్లు వినిపిస్తున్నాయి. ఈసారి ఎలాగైనా సీఎంతో పాటుగా లోకేష్ కూడా కడప జిల్లాలో మున్సిపాలిటీలో టిడిపి జెండా ఎగరవేయాలని తమ మనసులో మాట అన్నట్లుగా మాట్లాడుకున్నారట. ఇక బీటెక్ రవికి అన్ని విధాలుగా కూడా తమ అండదండలు ఉంటాయని.. అర్ధరాత్రి ఫోన్ చేసినా సరే పలకడానికి పనులు చేయడానికి తాము ఎప్పటికీ సిద్ధంగానే ఉన్నామంటూ బీటెక్ రవితో లోకేష్ అన్నట్లుగా వినిపిస్తున్నాయి.
పులివెందులలో వైసీపీ న్యాయకత సమస్య ఉన్నదని ప్రత్యేకించి శ్రద్ధ పెడితే చాలా మంది మన వైపు రావడానికి సిద్ధంగానే ఉన్నారంటూ లోకేష్ తో బీటెక్ రవి అన్నట్లుగా వినిపిస్తున్నాయి. ఇక బీటెక్ రవి కూడా రాబోయే ఏడెనిమిది నెలల్లో పులివెందులలో మున్సిపాలిటీ ఎన్నికల జరుగుతాయి.. అందులో టిడిపి పార్టీ విజయకేతనం ఎగురవేసి తమకు గిఫ్టుగా అందిస్తామంటూ బీటెక్ రవి లోకేష్ కి మాట ఇచ్చినట్లుగా వినిపిస్తోంది. అందుకే ఈసారి పులివెందుల మున్సిపాలిటీ టార్గెట్ అన్నట్లుగా బీటెక్ రవి పావులు కదుపుతున్నట్లు టాక్ వినిపిస్తోంది. వైసిపి హయాంలో పనులు చేసిన వారికి బిల్లులు రాక కాంట్రాక్టర్లు చాలామంది ఇబ్బందులు పడుతున్నారని వారందరినీ బీటెక్ రవి తమ వైపు తిప్పుకొని ప్రయత్నం చేస్తున్నారు. అలాగే వైసిపిలో ఆసంతృప్తిగా ఉన్న ముఖ్య నేతలను టిడిపి పార్టీ వైపుగా తీసుకువెళ్లేందుకు పావులు కలుపుతున్నారట.మరి ఈసారి అనుకున్నట్టుగానే మున్సిపాలిటీ టిడిపి పార్టీ కైవసం చేసుకుంటారా? లేదా అన్నది మిలియన్ డాలర్ల ప్రశ్నగా మారింది.. మరి వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి ఎలాంటి నిర్ణయాలు తీసుకుంటారోచూడాలి.