
వైసీపీ సీనియర్ నేత రాజ్యసభ సభ్యుడు వైవి సుబ్బారెడ్డి ఇప్పుడు వైసీపీలో ఒకే ఒక అదృష్ట జాతకుడిగా ఆ పార్టీ వర్గాలు చర్చించుకుంటున్నాయి. అసలు ఆయన ఎక్కడ ఉంటున్నారు ? ఏం చేస్తున్నారో ? తెలియటం లేదని ఆ పార్టీ నాయకులు చెబుతున్నారు. వైసీపీ అధికారంలో ఉన్నా లేకపోయినా సుబ్బారెడ్డి రాజకీయంగా ఏదో ఒక పదవిలో ఉంటూ వస్తున్నారు. సుబ్బారెడ్డికి వైసిపి ఎంతో ఉపయోగపడింది .. కానీ ఆయన వైసీపీకి ఎంతవరకు ఉపయోగపడ్డారు అన్న ప్రశ్నకు ఆన్సర్ లేదు. ప్రభుత్వం ఏర్పాటు అయిన వెంటనే టిటిడి చైర్మన్గా సుబ్బారెడ్డిని జగన్ నియమించారు. నాలుగేళ్ల పాటు ఆయన టీటీడీ చైర్మన్ గా పని చేశారు. మరి ఐదేళ్లు తన చిన్నాన్నకు టీటీడీ చైర్మన్ పదవి ఇస్తే బాగుండదేమో అని జగన్ మొహమాటపడి మరి ఆయనను తప్పించారేమో అనుకోవాలి. లేదంటే సీఎంగా జగన్ ఐదేళ్లు అధికారంలో ఉంటే సుబ్బారెడ్డి కూడా ఐదేళ్లు అధికారంలో టిటిడి చైర్మన్ గా ఉండేవారు.
2024 లో ఆయన వైసీపీ తరఫున రాజ్యసభకు ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. సుబ్బారెడ్డిని వైసీపీ పార్లమెంటరీ పార్టీ నేతగా జగన్ నియమించారు. వైసిపి అధికారంలో ఉండగా సుబ్బారెడ్డి తనయుడు విక్రాంత్ రెడ్డి ఉత్తరాంధ్రలో మైన్స్‌ను బాగా సొమ్ము చేసుకున్నారని అప్పట్లో పార్టీ వర్గాలే చెవులు కోరుక్కున్నాయి. వైసీపీ అధికారంలో ఉండగా జగన్ బాగా చూసుకునే వాళ్ళు ఎవరైనా ఉన్నారంటే సుబ్బారెడ్డి, బాలినేని శ్రీనివాస్ రెడ్డి కుటుంబాలనే అని పార్టీలో ప్రచారం ఉంది. అయితే బాలినేని జగన్ ను వదిలేసి జనసేనలో చేరిపోయారు. సుబ్బారెడ్డి ఆ తప్పు చేయలేదు. వైసీపీలోనే ఉంటూ తామరాకుపై నీటి బిందువులా రాజకీయం చేస్తున్నారు. ఇప్పుడు జగన్ వైసిపి నేతలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. కానీ వైసీపీ ఎదుర్కొంటున్న ఇబ్బందులను ఢిల్లీ వేదికగా సుబ్బారెడ్డి ఎప్పుడు అడ్రస్ చేసిన దాఖలాలు లేవు. వైసీపీలో ఎంత అదృష్టవంతుడు అంటే సుబ్బారెడ్డి ని మించిన వారు ఎవరూ లేరని పార్టీ నేతలు చెవులు కోరుక్కుంటున్నారు.