
ఈ మధ్య హరిహర వీరమల్లు రిలీజ్ కాగా, సెప్టెంబర్ 25న భారీ అంచనాలతో OG విడుదల కానుంది. అలాగే ఉస్తాద్ భగత్ సింగ్ షూటింగ్‌లో ఉన్నారు. రాజకీయాల్లో కూడా పవన్ కల్యాణ్ ప్రత్యేకమైన గుర్తింపు పొందారు. 2014లో స్థాపించిన జనసేన పార్టీ, 2024లో టీడీపీ-బీజేపీతో కూటమిగా పోటీ చేసి, 100% స్ట్రైక్ రేట్ సాధించింది. పిఠాపురం నుంచి ఎమ్మెల్యేగా గెలిచి, నారా చంద్రబాబు నాయుడు కేబినెట్‌లో డిప్యూటీ సీఎం గా బాధ్యతలు స్వీకరించారు. ఒకవైపు రాజకీయాలు, మరోవైపు సినిమాలు – రెండింటినీ సమతుల్యం చేస్తూ ముందుకు సాగుతున్నారు. ఆస్తులు & నెట్‌వర్త్: పవన్ కళ్యాణ్ mla నామినేషన్ అఫిడవిట్ ప్రకారం ఆయన ఆస్తుల మొత్తం విలువ రూ.164 కోట్లు. ఇందులో సుమారు రూ.65 కోట్ల అప్పులు ఉన్నట్లు పేర్కొన్నారు. ప్రస్తుతం మార్కెట్ విలువ ప్రకారం పవన్ కళ్యాణ్ నెట్‌వర్త్ రూ.125 కోట్ల నుంచి రూ.140 కోట్ల మధ్య ఉండొచ్చని అంచనా.
ఇళ్లు & రియల్ ఎస్టేట్ పెట్టుబడులు: విజయవాడలో లగ్జరీ ఇల్లు – విలువ రూ.16 కోట్లు , హైదరాబాద్ జూబ్లీహిల్స్‌లో ఇల్లు – విలువ రూ.12 కోట్లు, బంజారాహిల్స్‌లో ఫ్లాట్ – విలువ రూ.1.75 కోట్లు , అదనంగా, తెలుగు రాష్ట్రాల్లో మరికొన్ని ప్రాపర్టీలు ఉన్నట్టు తెలుస్తోంది. సినిమా పారితోషికం:ప్రస్తుతం ఒక్కో సినిమా కోసం పవన్ కళ్యాణ్ రూ.50 – రూ.60 కోట్ల రెమ్యూనరేషన్ తీసుకుంటున్నారు. OG కోసం రూ.100 కోట్ల వరకు, ఉస్తాద్ భగత్ సింగ్ కోసం అయితే అక్షరాలా రూ.172 కోట్ల వరకు తీసుకుంటున్నారని వార్తలు వస్తున్నాయి. ఇది నిజమైతే టాలీవుడ్ చరిత్రలోనే అతిపెద్ద రికార్డు అవుతుంది. మొత్తానికి – పవన్ కళ్యాణ్ కేవలం సినీ స్టార్ కాదు, రాజకీయాల్లో కూడా శక్తివంతమైన నాయకుడు. తన కృషితో, నిజాయితీతో సంపాదించిన ఆస్తులు, సంపాదన, ఇమేజ్ ఆయనను ఈరోజు ఉన్న స్థాయికి తీసుకువచ్చాయి. పవన్ నెట్‌వర్త్ పెరిగినా, అభిమానుల్లో ఆయన విలువ మాత్రం ఎప్పటికీ అమూల్యం.