జై తెలంగాణ.. జై జాగృతి అంటూ నినాదాలు చేస్తూ తాజాగా ప్రెస్ మీట్ లో ఎమ్మెల్సీ కవిత తన ప్రసంగాన్ని ప్రారంభించారు. ముందుగా బిఆర్ఎస్ పార్టీ నుంచి వచ్చిన సస్పెన్షన్ లెటర్ ను చదివి వినిపించింది. నిన్నటి రోజున మధ్యాహ్నం బిఆర్ఎస్ పార్టీ నుంచి ఈ ప్రకటన వచ్చిందని.. తాను ప్రవర్తిస్తున్న తీరు వల్ల పార్టీ వ్యతిరేక కార్యకలాపాలు చేస్తూ ఉండడం వల్ల సస్పెండ్ చేశారని తెలిపింది. లేఖలో ఈ రెండు అంశాల పైన మాట్లాడుతామని.. తాను తీహార్ జైలు నుంచి వచ్చాక గురుకులాల పరిస్థితిపై ఎన్నో పోరాటాలు చేశానని తెలిపింది.


బనకచర్లపై రౌండ్ టేబుల్ సమావేశాలు ఏర్పాటు చేశానని.. సీఎం జిల్లాలోనే భూ నిర్వాసితులకు అండగా నిలబడ్డ అంటూ తెలియజేసింది. ముఖ్యంగా పెన్షన్లను పెంచాలని, ఆడబిడ్డలకు ఆర్థిక సహాయం చేయాలని ఉద్యమం కూడా చేశానని. గత ఏడాది నవంబర్ నుంచి 47 నియోజకవర్గాలలో ఎన్నో పోరాటాలు ప్రజాసమస్యల పైన చేశానని అది కూడా గులాబీ కండువా కప్పుకొని చేస్తే పార్టీకి ఎలా వ్యతిరేకమవుతుందో అంటూ ప్రశ్నించింది కవిత.


బిఆర్ఎస్ పార్టీలో ఇద్దరు పనిగట్టుకొని తమ పైన విష ప్రచారం చేస్తున్నారంటూ సంచలన ఆరోపణలు చేసింది కవిత. హరీష్ రావు, సంతోష్ రావు ఇంట్లో బంగారం ఉంటే.. అది బంగారు తెలంగాణ కాదంటూ తెలిపింది.. చెల్లి అయ్యుండి, ఒక మహిళ ఎమ్మెల్సీ పైన ఆఫీసులోనే కుట్ర జరుగుతోంది అన్న అంటూ కేటీఆర్ కు చెప్పాను.. సుమారుగా 103 రోజులైంది. వర్కింగ్ ప్రెసిడెంట్ అయిన కేటీఆర్ కూడా ఏం జరిగిందనే విషయంపై కనీసం అడక్కపోవడం చాలా దారుణం అంటూ తెలిపింది. కనీసం బంధుత్వాన్ని పక్కనపెట్టి ఒక మహిళ ఎమ్మెల్సీ బాధను పట్టించుకోకుంటే ఎలా అంటూ కేటీఆర్ పైన ఆరోపణలు చేసింది కవిత. కేవలం కొంతమంది వ్యక్తిగత లబ్ధి కోరుకునే వ్యక్తులే పార్టీలో నుంచి తమను బయటకు పంపించేలా చేశారని మాట్లాడింది. రేపటి రోజున కేటీఆర్ కు ,తన తండ్రి పైన కూడా ఇలాంటి కుట్రలు జరుగుతాయని కామెంట్ చేసింది కవిత. ఈ క్రమంలోనే ఆమె ఎమ్మెల్సీ పదవితో పాటు బిఆర్ఎస్ పార్టీ ప్రాథమిక సభ్యత్వానికి కూడా రిజైన్ చేసినట్లు ప్రకటించారు.


టిఆర్ఎస్ పార్టీని కొంతమంది తమ చేతులలో పెట్టుకోవాలని ప్రయత్నాలు చేస్తున్నారంటూ సంచలన ఆరోపణలు చేసింది.హరీష్ రావు  ,రేవంత్ రెడ్డితో విమానంలో ప్రయాణించిన తర్వాతే తమ పైన కుట్రలు మొదలయ్యాయి అంటూ హరీష్ రావు పైన ఆరోపణలు చేసింది.

మరింత సమాచారం తెలుసుకోండి: