ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సొంత జిల్లా (ఉమ్మడి చిత్తూరు) రాజకీయాలు ఇప్పుడు శ్రీకాళహస్తి ఎమ్మెల్యే gopala krishna REDDY' target='_blank' title='బొజ్జల-గురించి లేటెస్ట్ అప్డేట్స్, ఫోటోలు, వీడియోల కొరకు వెంటనే క్లిక్ చేయండి. '>బొజ్జల సుధీర్ రెడ్డి చుట్టూ తిరుగుతున్నాయి. దివంగత నేత, చంద్రబాబుకు అత్యంత సన్నిహితుడైన gopala krishna REDDY' target='_blank' title='బొజ్జల-గురించి లేటెస్ట్ అప్డేట్స్, ఫోటోలు, వీడియోల కొరకు వెంటనే క్లిక్ చేయండి. '>బొజ్జల గోపాలక్రిష్ణారెడ్డి కుమారుడైన సుధీర్ రెడ్డి, తొలిసారి ఎమ్మెల్యేగా గెలిచినప్పటికీ, తన వ్యవహారశైలితో సొంత పార్టీకే తలనొప్పిగా మారారని తీవ్ర ప్రచారం జరుగుతోంది. ఆయన అవినీతి, బెదిరింపులు, వివాదాస్పద నిర్ణయాలతో విసిగిపోయిన టీడీపీ నాయకులు, కార్యకర్తలు ఏకంగా అధిష్టానానికి ఫిర్యాదులు పంపుతున్నారనే వార్తలు కలకలం రేపుతున్నాయి. ముఖ్యమంత్రి చంద్రబాబు, మంత్రి నారా లోకేశ్ సైతం సుధీర్ రెడ్డి తీరుపై తీవ్ర అసంతృప్తితో ఉన్నట్టు తెలుస్తున్నా, దివంగత gopala krishna REDDY' target='_blank' title='బొజ్జల-గురించి లేటెస్ట్ అప్డేట్స్, ఫోటోలు, వీడియోల కొరకు వెంటనే క్లిక్ చేయండి. '>బొజ్జల గోపాలక్రిష్ణారెడ్డిపై ఉన్న గౌరవం కారణంగానే చంద్రబాబు మెతక వైఖరి ప్రదర్శిస్తున్నారనే అభిప్రాయం వ్యక్తమవుతోంది.
 

అయితే, ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి మాత్రం అధిష్టానం ఆగ్రహాన్ని సైతం లెక్కచేయకుండా తన పంథాలోనే ముందుకు సాగుతున్నారని పార్టీ వర్గాలు గుసగుసలాడుతున్నాయి. శ్రీకాళహస్తి టీడీపీ కార్యకర్తల ఆవేదన పతాక స్థాయికి చేరిందని తెలుస్తోంది. కొందరు కార్యకర్తలు ఏకంగా, "ప్రస్తుత ఎమ్మెల్యే కన్నా, గత వైకాపా ఎమ్మెల్యే బియ్యపు మధుసూదనరెడ్డి వెయ్యి రెట్లు బెటర్" అంటూ హైకమాండ్‌కు లేఖలు రాయడం పరిస్థితి తీవ్రతను తెలియజేస్తోంది. మాజీ ఎమ్మెల్యే ఎస్వీ నాయుడు సైతం సుధీర్ రెడ్డిపై వస్తున్న ఆరోపణలు, విమర్శలను ఏకంగా 100 పేజీల లేఖ ద్వారా అధిష్టానానికి వివరించినట్టు సమాచారం. గతంలో అసెంబ్లీ సమావేశాల సమయంలో పోలీసు అధికారి బదిలీపై సుధీర్ రెడ్డి ప్రభుత్వంపై విమర్శలు చేయడం అప్పట్లో హాట్ టాపిక్‌గా మారింది. తాజాగా, ఓ స్క్రాప్ డీలర్‌ను వేధిస్తున్నారనే ఆరోపణలు రావడంతో ఆయన తీరు మళ్లీ చర్చనీయాంశమైంది.

 

అంతేకాకుండా, గతంలో జనసేన మాజీ ఇన్‌ఛార్జి కోట వినుత వ్యక్తిగత రహస్యాలను తెలుసుకునేందుకు ప్రయత్నించడం, ఆ తర్వాత ఆమె డ్రైవరు రాయుడు హత్యలో ఆయన పరోక్ష పాత్ర ఉందనే ఆరోపణలను సుధీర్ రెడ్డి ఎదుర్కొన్నారు. ప్రతిసారీ తన వ్యవహార సరళిని సమర్థించుకునే సుధీర్ రెడ్డి, తన తీరు మార్చుకోకపోవడంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. సుధీర్ రెడ్డి తీరు ముఖ్యమంత్రి చంద్రబాబు సహనాన్ని పరీక్షించేలా ఉందనీ, ఇదే పరిస్థితి కొనసాగితే అధిష్టానం కఠిన చర్యలు తీసుకునే అవకాశం ఉందని టీడీపీ సీనియర్లు హెచ్చరిస్తున్నారు. ఇప్పటికే ఆయన ముఖ్యమంత్రి 'హిట్ లిస్ట్'లో చేరిపోయారంటూ ప్రచారం జరుగుతోంది. ఈ నేపథ్యంలో, gopala krishna REDDY' target='_blank' title='బొజ్జల-గురించి లేటెస్ట్ అప్డేట్స్, ఫోటోలు, వీడియోల కొరకు వెంటనే క్లిక్ చేయండి. '>బొజ్జల సుధీర్ రెడ్డి తన వైఖరిని మార్చుకుంటారా? లేదా? అనేది జిల్లా రాజకీయాల్లో ఇప్పుడు అత్యంత ఆసక్తికరంగా మారింది.

మరింత సమాచారం తెలుసుకోండి: