
దేశవ్యాప్తంగా అక్టోబర్ 19 నుంచే చోట దీపావళిగా చేసుకుంటున్నారు. ఆ తర్వాత రోజు అంటే ఈరోజు దీపావళి పండుగ జరుపుకోబోతున్నారు. హిందూ క్యాలెండర్ ప్రకారం ప్రతి తేడాది కార్తీక మాసంలో కృష్ణపక్ష అమావాస్య రోజున ఈ దీపావళి పండుగను జరుపుకుంటారు. పురాణాలు తెలుపుతున్న ప్రకారం శ్రీరాముడు 14 ఏళ్ల వనవాసం తరువాత కార్తీక అమావాస్య రోజు అయోధ్యకు తిరిగి వచ్చారని ఆయన స్వాగతానికి అక్కడ ఉండే నగర పౌరులు అయోధ్య మొత్తాన్ని దీపాలతో వెలిగించారని మన పురాణాలు తెలుపుతున్నాయి.
అజ్ఞానమనే చీకటిని పోగొట్టి జ్ఞానమనే వెలుగును నింపడానికి ఈ దీపోత్సవాన్ని జరుపుకుంటారు. అందుకే ఈ రోజున రామ్ జినీ పూజిస్తూ ఉంటారు. అంతేకాకుండా లక్ష్మీదేవి సముద్రం చిలికిన తర్వాత ఉద్భవిస్తుంది. అందుకే ఈ రోజున లక్ష్మీదేవి పూజించడం మంచిది. అలాగే గణేశుడిని కూడా పూజించడం మంచిది. దీపావళి పండుగ రోజున దీపాలు వెలిగించడం వల్ల ఆ ఇంటిల్లిపాది ఆనందం, సంపద, శాశ్వత ప్రశాంతత వంటివి లభిస్తాయని నమ్ముతూ ఉంటారు.
దీపావళి పూజకు శుభసమయం విషయానికి వస్తే..
లక్ష్మీ ముహూర్తం:రాత్రి7:08 నుండి 8:18 వరకు.
ప్రదోషకాలం: సాయంత్రం 5:46 నుండి 8:18 వరకు
సింహ లగ్నం: మధ్యాహ్నం 1:38 నుండి తెల్లవారుజామున 3:56 నిమిషాల వరకు
ఈ సమయాలలో లక్ష్మీదేవి గణేష్ ని పూజించడం మంచిది.