ఇండియాలో పొలిటికల్ పార్టీలు చాలా డిఫరెంట్ గా ఉంటాయి. ఇతర దేశాల్లో అయితే పొలిటికల్ పార్టీలు, ప్రజలు ట్రాన్స్పరెంట్ గా ఉండరు. అమెరికా, జపాన్ లాంటి దేశాల్లో వారికి ఎవరైతే అభివృద్ధి చేస్తారో వారిని మాత్రమే ఎన్నుకొని  దేశాన్ని అభివృద్ధి బాటలో ముందుకు తీసుకెళ్లడానికి ప్రజలు సహకారం అందిస్తారు. కానీ ఇండియాలో ఉండే రాజకీయ పార్టీలు చాలా దారుణం. ప్రస్తుతం ఇండియాలో ఉండే రాజకీయ నాయకుల చేతుల్లో ఉండే సంపద, దేశం మొత్తం ప్రజల్లో ఉండే సంపదతో సమానంగా ఉందని చాలా సర్వేలు చెప్పాయి. ఆ విధంగా రాజకీయాల్లో రాణించేవారు వారి సంపదను పెంచుకోవడానికి మాత్రమే రాజకీయాల్లోకి ఎంట్రీ ఇస్తున్నారు.  స్వాతంత్రం వచ్చిన నాటి నుంచి మన దేశం అభివృద్ధి చెందుతున్న దేశంగానే ఉంది తప్ప అభివృద్ధి చెందిందని ఇప్పటివరకు ఎవరు చెప్పలేకపోతున్నారు. దీనికి ప్రధాన కారణం రాజకీయ పార్టీలు, ఆ పార్టీలలో ఉండే నాయకులు.. ఒక ఇంట్లో నుంచి ఒక ఎమ్మెల్యే అయ్యారు అంటే వారి కుటుంబాలు, తరతరాలు కూర్చుండి తిన్న తరగని ఆస్తులు సంపాదిస్తున్నారు. ఆ విధంగా మళ్లీ వారి కొడుకులు, మనవళ్ళు,మనవరాళ్లు ఇలా వారసత్వం గానే రాజకీయాల్లో శాసిస్తున్నారు. ఇలా ఇండియాలో ఉండే అన్ని పార్టీల్లో వారసత్వ రాజకీయాలనేవి పెరిగిపోయాయి. 

ఇందులో ముఖ్యంగా బీహార్ లో వారసత్వ రాజకీయాలు ఎక్కువగా ఉంటాయని  చెప్పవచ్చు. మరి బీహార్ లో వారసత్వ నాయకులు ఎవరు.. వారి పార్టీలు ఏంటి అనే వివరాలు చూద్దాం.. బీహార్ లో ముఖ్యంగా చెప్పుకోవాల్సింది ఆర్జెడి అధినాయకుడు లాలూ ప్రసాద్ యాదవ్ కుమారుడు తేజస్వి యాదవ్. తండ్రి నుంచి రాజకీయాలు అందిపుచ్చుకొని బీహార్ రాజకీయాల్లో నిలిచారు. ఈయనే కాకుండా తారాపూర్ నుండి బిజెపి తరఫున పోటీ చేస్తున్న  సామ్రాట్ చౌదరి కూడా మాజీ మంత్రి శకుని చౌదరి కుమారుడే. రాష్ట్రీయ లోక్ మోర్చాకు చెందినటువంటి స్నేహలత , ఆ పార్టీ అధినేత ఉపేంద్ర కుష్వాహ సతీమణి, ఈమె సాసారం నియోజకవర్గం నుంచి పోటీ చేస్తోంది. అలాగే బిజెపి నాయకుడు నితీష్ మిశ్రా , మాజీ సీఎం జగన్నాథమిశ్రా కుమారుడు. ఈయన జుంజుంపూర్ నుంచి పోటీ చేస్తున్నారు. హిందుస్థాన్ ఆవాయ్ మోర్ఛ నేత దీప మాన్షి కేంద్ర మంత్రి జీతన్ రాయ్ మాన్షి  కోడలు..ఈమె ఇమామ్ గంజ్ నుంచి పోటీ చేస్తోంది. అలాగే జేడీయు నేతలు కోమల్ సింగ్ ఎల్జేపి ఎంపీ వీణాదేవి కుమార్తె.. ఈమె గయాగట్ స్థానం నుంచి పోటీ చేస్తోంది. అలాగే ఆర్జెడి నేత రాహుల్ తివారి సీనియర్ నేత శివానంద తివారి కుమారుడు ఈయన షాహపూర్ నుంచి పోటీ చేస్తున్నారు.

 అలాగే బిజెపి నేత రాకేష్ ఓషో  దివంగత విశ్వేశ్వర వాసు కుమారుడు. వీణా దేవి ఆర్జెడి నాయకుడు సూరజ్ బాను సతీమణి ఈమె మేకామా నుంచి పోటీ చేస్తోంది. అంతేకాకుండా శివాని శుక్లా ఆర్జెడి నేత మున్నా శుక్లా కూతురు..  ఈమె లాల్ గంజ్ నుంచి పోటీ చేస్తోంది. ఈ విధంగా బీహార్ లో ప్రస్తుతం పోటీలో ఉన్న అన్ని పార్టీల నాయకులు ఏదో ఒక రకంగా రాజకీయ వారసత్వం నుంచి వచ్చినవారే అని ఏఎన్ సిన్హా  ఇన్స్టిట్యూట్ ఆఫ్  సోషల్ స్టడీస్ కు చెందిన అసిస్టెంట్ ప్రొఫెసర్ విద్యార్థి వికాస్ పేర్కొన్నారు. అయితే బీహార్ లో కుటుంబ వారసుల రాజకీయాలు పెరిగిపోవడానికి ప్రధాన కారణం రాజకీయాల్లోకి సామాన్య కుటుంబాల నుంచి ఎవరూ రావడం లేదు. దీనికి తోడు అక్కడ అక్షరాస్యత శాతం చాలా తక్కువ. ఇటీవల జరిగినటువంటి సర్వేలో కేవలం 14.70 ఒక శాతం మందే పదోతరగతి ఉత్తీర్ణత సాధించారని వికాస్ తెలియజేశారు. చదువు లేకపోవడం సామాజికంగా వెనుక పడిపోవడం వల్లే ఇతరులు రాజకీయంగా వెనుకబడిపోయారని, దీనివల్ల కుటుంబ వారసుల రాజకీయాలు పెరిగిపోయాయని ఆయన తెలియజేశారు.

మరింత సమాచారం తెలుసుకోండి: