
ఉప్పు దీపం :
శుక్రవారం ఉప్పు దీపం పెట్టడం ధన ఆకర్షణకు విశేషమైనదిగా భావించి ఆచరిస్తూ ఉంటారు . మరి ముఖ్యంగా వరలక్ష్మి వ్రతం రోజు వచ్చే శుక్రవారం రోజు ఇలా ఉప్పు దీపం పెట్టడం వల్ల చాలా చాలా మంచి జరుగుతుందట . ఆ లక్ష్మీదేవి అనుగ్రహం కచ్చితంగా ఆ ఇంటిపై చూపిస్తుందట . ముఖ్యంగా దీపావళి పండుగ రోజు అదేవిధంగా వరలక్ష్మీ వ్రతం రోజు మహిళలు ఈ ఉప్పు దీపాన్ని ఇక్కడ అస్సలు మర్చిపోకుండా పెడుతూ ఉంటారు . ఉప్పుకు ప్రతికూల శక్తులను గ్రహించి సానుకూల శక్తులను ఆకర్షించే స్వభావం ఉండడం వల్లే ఉప్పుదీపం పెట్టడం ఇంట్లో ఉండే నెగిటివ్ ఎనర్జీ పోతుంది అంటున్నారు పండితులు. చాలామంది మహిళలు ఇప్పటికీ ఈ ఉప్పు దీపం సెంటిమెంట్ ఆచరిస్తూనే ఉంటారు . దీనివల్ల ఇంట్లో ధనాకర్షణ శక్తి పెరిగి ఆర్థిక సమస్యలు దూరం అవుతాయి అని పండితులు చెప్తున్నారు.
తులసి మొక్కకు పూజ చేయడం:
సాధారణంగా ప్రతి శుక్రవారం మహిళలు తులసి మొక్కకు దీపారాధన చేస్తూ ఉంటారు . అయితే వరలక్ష్మీ వ్రతం రోజు వచ్చే శుక్రవారం నాడు తులసి మొక్కకు పూజలు చేయడం వల్ల విశేషమైన లాభాలు పొందుతారు అంటున్నారు పండితులు. తులసిని అత్యంత పవిత్రంగా భావిస్తుంటారు హిందూ సాంప్రదాయంలో అని ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు . అందుకే ఇప్పటికి చాలామంది ఇళ్లలో తులసి మొక్కకు పూజ చేస్తారు. తులసి సాక్షాత్తు లక్ష్మీదేవి అంశంగా విష్ణుమూర్తికి అత్యంత ప్రీతికరమైనదిగా జనాలు భావిస్తూ ఉంటారు . వరలక్ష్మీ వ్రతం రోజున తులసి చెట్టుకు పూజ చేస్తే లక్ష్మి కటాక్షంతో పాటు ఆరోగ్యం ఐశ్వర్యం కలుగుతుంది అని ప్రగాఢ విశ్వాసం.
గోమాతకు పూజ చేయడం:
గోమాతలో సర్వదేవతలు ఉంటారు అనేది అందరికీ తెలుసు . చాలామంది గోమాతలను ప్రత్యేకంగా పూజిస్తూ ఉంటారు . వరలక్ష్మీ వ్రతం రోజున ఆవుకు ఆహారం పెట్టడం. సేవ చేయడం వల్ల లక్ష్మీదేవి ఆశీస్సులు పుష్కలంగా ఉంటాయి అంటున్నారు పండితులు. హిందూ ధర్మంలో గోమాతను పవిత్రంగా భావిస్తారు. సాక్షాత్తు దేవతా స్వరూపంగా సకల దేవతలను నిలయంగా భావిస్తూ ఉంటారు . అలాంటి గోమాతకు వరలక్ష్మీ వ్రతం రోజున పూజ చేయడం వల్ల ఇంట్లో సిరి సంపదలు అదేవిధంగా ఎప్పుడు సంతోషంగా అష్ట అశ్వర్యాలు కలుగుతాయని ప్రగాఢ విశ్వాసం . ఆవుకు సేవ చేయడం మతపరమైన ఆలోచన మాత్రమే కాదు పర్యావరణానికి సమస్త మానవాళికి ఎంతో మేలు చేస్తుంది..!!