ప్రపంచ క్రికెట్ ప్రేక్షకులందరూ ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న టి20 వరల్డ్ కప్ మరికొన్ని రోజుల్లో ప్రారంభం కాబోతుంది. ఈ క్రమంలోనే ఇక టీమిండియా అభిమానులందరూ విశ్వవిజేతగా ఈ సారి భారత జట్టు నిలవాలని ఎంతో ప్రగాఢంగా కోరుకుంటున్నారు. అయితే ఇక టి20 వరల్డ్ కప్ లో భారత జట్టు లో ఏ ఆటగాడు ఏ స్థానంలో ఆడితే బాగుంటుంది అని మాజీ ఆటగాళ్లు  అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. కాగా ఇటీవల ఐసీసీ ప్రకటించిన షెడ్యూల్ ప్రకారం అక్టోబర్ నెల లో టి20 వరల్డ్ కప్ ప్రారంభం కాబోతుంది. అయితే ఇటీవలే టీమిండియా జట్టుపై మాజీ క్రికెటర్ సంజయ్ మంజ్రేకర్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.




 టి20 వరల్డ్ కప్ లో టీమిండియా లో మూడవ స్థానం లో యువ ఆటగాడు సూర్య కుమార్ యాదవ్ కి అవకాశం ఇవ్వాలని మాజీ క్రికెటర్ సంజయ్ మంజ్రేకర్ సూచించాడు. కాగా ప్రస్తుతం సూర్య కుమార్ యాదవ్ శ్రీలంక పర్యటన లో ఉన్నాడు. ఈ నెల 13 నుంచి ప్రారంభం కాబోయే వన్డే టి20 సిరీస్ లలో యంగ్ టీమ్ ఇండియా జట్టు లో ఆడుతున్నాడు సూర్యకుమార్ యాదవ్  అయితే ఇటీవల సూర్య కుమార్ యాదవ్ పై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు సంజయ్ మంజ్రేకర్.



ఒకవేళ టి20 వరల్డ్ కప్ లో కోహ్లీ ఓపెనర్ గా బరిలోకి దిగితే అప్పుడు ఇక మూడవ స్థానం లో సూర్య కుమార్ యాదవ్ కి అవకాశం కల్పించాలని చెప్పుకొచ్చాడు. ఆ స్థానం కోసం కేఎల్ రాహుల్ కూడా పోటీలో ఉన్నాడు అంటూ తెలిపాడు. తన అంచనా ప్రకారం కేఎల్ రాహుల్ కి బదులు సూర్యకుమార్ యాదవ్ కి మూడవ స్థానంలో ఆడే అవకాశం వస్తుంది అంటూ చెప్పుకొచ్చాడు.ప్రస్తుతం శ్రీలంక టూర్ లో సూర్యకుమార్ యాదవ్ ఎలా రాణిస్తాడు అన్న దానిపై కూడా ఇక అతనికి టి20 వరల్డ్ కప్ లో స్థానం దక్కుతుందా లేదా అన్నది ఆధారపడి ఉంటుంది

మరింత సమాచారం తెలుసుకోండి: