ప్రస్తుతం భారత క్రికెట్ లో కొనసాగుతున్న స్టార్ క్రికెటర్ ల గురించి అందరికీ తెలుసు.  కానీ టీమిండియాలో స్థానం దక్కించుకోవాలని ఎంతగానో వేచి చూస్తున్నా యువ స్టార్ ల గురించి మాత్రం చాలా తక్కువ మందికే తెలుసు. ఇక అలాంటి వారి గురించి తెలుసుకోవాలంటే మాత్రం ప్రతి ఒక్కరు ఐపీఎల్ చూడాల్సిందే. అప్పటివరకూ ఎక్కడ అంతర్జాతీయ మ్యాచ్లు ఆడిన అనుభవం లేని ఎంతో మంది యువ ఆటగాళ్లు తమ ప్రతిభతో అందరినీ అవాక్కయ్యేలా చేస్తూ ఉంటారు.


 కొంత మంది ఆటగాళ్లు బంతితో అద్భుతాలు సృష్టిస్తు ఉంటే మరి కొంత మంది ఆటగాళ్ళు బ్యాట్ తో విరుచుకుపడుతూ ఉంటారు.  ఇప్పటివరకు ఐపీఎల్ లో ఎంతో మంది ఆటగాళ్లు సూపర్ స్టార్ గా మారి భారత జట్టులో స్థానం సంపాదించుకున్న వారు కూడా ఉన్నారు. ఇటీవలే ఐపీఎల్ రెండవ దశలో భాగంగా ముంబై ఇండియన్స్ కోల్కతా నైట్రైడర్స్ జట్ల మధ్య మ్యాచ్ జరిగింది. ఇక ఈ మ్యాచ్లో ఫేవరేట్గా బరిలోకి దిగిన ముంబై ఇండియన్స్ జట్టు చివరి కి తక్కువ పరుగులు చేసి ఓటమి పాలు అయింది. సాధారణంగా ముంబై ఇండియన్స్ జట్టు ప్రత్యర్థికి తక్కువ టార్గెట్ ఇచ్చినప్పటికీ.. ఇక ఆ జట్టుకు పటిష్టమైన బౌలింగ్ విభాగం ప్రత్యర్థిని తక్కువ పరుగులకే కట్టడి చేయడంలో విజయం సాధిస్తూ ఉంటుంది. తద్వారా ముంబై మ్యాచ్ గెలుస్తూ ఉంటుంది. కానీ నిన్న ముంబై ఇండియన్స్ ఫై కోల్కతా నైట్రైడర్స్ ఓపెనర్ వెంకటేష్ విరుచుకుపడ్డాడు. పటిష్టమైన బౌలింగ్ లైనప్ ఉన్న ముంబైకి వెంకటేష్ అయ్యర్ చుక్కలు చూపించాడు అని చెప్పాలి. మొదటి బంతి నుంచి సిక్సర్లు ఫోర్లు కొట్టడం ప్రారంభించాడు. బౌలర్ ఎవరు అన్నది లెక్క చేయకుండా ఎలాంటి భయం లేకుండా ధాటిగా ఆడి అందరి చూపులు ఆకర్షించాడు.  అంతకుముందు రాయల్ చాలెంజర్స్ బెంగళూరు పై కూడా ఇలాగే ఆడటం గమనార్హం. దీంతో ఐపీఎల్ లో భయం అంటే తెలియని క్రికెటర్ అంటూ సీనియర్లు అతని పై ప్రశంసలు కురిపిస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

Ipl