ఈ ఏడాది ఐపీఎల్ సీజన్లో ఎంతో మంది యువ ఆటగాళ్లు తమ ప్రతిభతో సత్తా చాటుతున్నారు. ఈ క్రమంలోనే తను స్పీడ్ బౌలింగ్ లో ప్రస్తుతం ప్రశంసలు అందుకుంటున్నాడు యువ బౌలర్ ఉమ్రాన్ మాలిక్. ప్రస్తుతం సన్రైజర్స్ హైదరాబాద్ జట్టుకు ప్రాతినిధ్యం వహిస్తున్న ఈ స్పీడ్ బౌలర్  వేగంతో బంతులను విసురుతు ప్రస్తుతం రికార్డులు సృష్టిస్తున్నాడు అని చెప్పడంలో అతిశయోక్తి లేదు. ఇప్పటివరకు ఏ బౌలర్ కి సాధ్యం కాని రీతిలో గంటకు 157 కిలోమీటర్ల వేగంతో బంతులు విసిరి రికార్డు సృష్టించాడు.


 ఇక సన్రైజర్స్ ఏ జట్టుతో మ్యాచ్ ఆడిన అటు ఉమ్రాన్ మాలిక్ ను మించి  వేగంగా బంతులను విసిరే బౌలర్ ఎక్కడా కనిపించడం లేదనే చెప్పాలి. ఈ క్రమంలోనే బుల్లెట్ లాంటి బంతులను విసురుతు కీలకమైన సమయంలో వికెట్లు పడగొట్టి జట్టు విజయంలో కీలక పాత్ర పోషిస్తున్నాడు ఉమ్రాన్ మాలిక్. ఈ క్రమంలోనే అతనిలో ఎంతో ప్రతిభ దాగి ఉందని అతన్ని వెంటనే టీమిండియా లోకి తీసుకోవాలి అనే డిమాండ్లు రోజురోజుకు ఎక్కువైపోతున్నాయి అన్న విషయం తెలిసిందే.


 ఈ క్రమంలోనే పాకిస్తాన్ మాజీ వికెట్ కీపర్ కామ్రాన్ అక్మల్ ఉమ్రాన్ మాలిక్ గురించి ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. ఒకవేళ ఉమ్రాన్ మాలిక్ పాకిస్తాన్ లో ఉండి ఉంటే ఇప్పటికే అంతర్జాతీయ క్రికెట్ లోకి అరంగేట్రం చేసే వాడు అంటూ కామ్రాన్ అక్మల్ చెప్పుకొచ్చాడు. అతడు బౌలింగ్ లో ఎక్కువ పరుగులు సమర్పించుకున్నాడు. అయితే అతడు వికెట్ కూడా పడగొడుతూ  ఉండడం గమనార్హం. గంటకు 50 కిలోమీటర్ల వేగంతో బంతులు వేస్తున్నాడు. మ్యాచ్ మ్యాచ్ కి అతని బౌలింగ్ వేగం కూడా అంతకంతకూ పెరుగుతోంది. అయితే బ్రెట్ లి, అక్తర్ లూ కూడా చాలా పరుగులు ఇచ్చేవారు. కానీ వికెట్లు పడగొట్టేవారు. మొన్నటి వరకు టీమిండియాలో నాణ్యమైన ఫాస్ట్ బౌలర్లు లేరు. కానీ ఇప్పుడు వారికి నవదీప్ సైని,మహమ్మద్ సిరాజ్, షమి, జస్ప్రిత్ బూమ్రా లాంటి పేసర్లు దొరికారు. ఎక్కువమంది పేస్ బౌలర్లు  ఉండడంతో ఉమ్రాన్ మాలిక్ ను సెలెక్ట్ చేయడం కష్టతరంగా మారింది అంటూ కమ్రాన్ అక్మల్ చెప్పుకొచ్చాడు..

మరింత సమాచారం తెలుసుకోండి: