
అంతేకాదు ఈ ఏడాది ఏకం గా నాలుగు సెంచరీలు 3 అర్థ సెంచరీలతో అద్భుతమైన ప్రతిభ కనపరిచాడు అని చెప్పడం లో అతిశయోక్తి లేదు. అయితే ఇటీవలే కీలకమైన ఫైనల్ మ్యాచ్లో మాత్రం అనుకున్నంత స్థాయి లో రాణించలేకపోయాడు అన్న విషయం తెలిసిందే. మరోసారి సెంచరీ చేసి అదర గొడతాడూ అనుకుంటున్న సమయం లో 39 పరుగుల వద్ద వికెట్ కోల్పోయాడు. చివరికి ఆ తరువాత రాజస్థాన్ రాయల్స్ బ్యాట్స్మెన్లు అందరూ చేతులెత్తేయడం తో కీలకమైన ఫైనల్ మ్యాచ్లో ఓటమి చవిచూసింది రాజస్థాన్ జట్టు.
ఫైనల్ మ్యాచ్లో రాజస్థాన్ రాయల్స్ ఓడి పోయినప్పటికీ జోస్ బట్లర్ మాత్రం ఎన్నో అవార్డులు సాధించాడు. ఐపీఎల్ లో అత్యధిక పరుగులు చేసినందుకుగాను పదిహేను లక్షలు అందుకున్నాడు. అత్యధికంగా సిక్సర్లు 45 కొట్టినందుకు, పవర్ ప్లేయర్ ఆఫ్ ది సీజన్ గా, మోస్ట్ వాల్యూబుల్ ప్లేయర్ గా నిలిచినందుకుగాను పది లక్షల చొప్పున అందుకున్నాడు జోస్ బట్లర్. ఎమర్జింగ్ ప్లేయర్ ఆఫ్ ది సీజన్ గా ఉమ్రాన్ మాలిక్ అవార్డు అందుకోవడం గమనార్హం.. ఇలా రాజస్థాన్ ఓడిపోయినప్పటికీ బట్లర్ కి మాత్రం భారీగానే ప్రైజ్ మనీ మూట్టింది అని చెప్పాలి.