ప్రస్తుతం భారత జట్టు ఇంగ్లండ్ పర్యటనలో ఉంది అన్న విషయం తెలిసిందే. ఇంగ్లండ్ పర్యటనలో భాగంగా టెస్ట్ మ్యాచ్ ఆడబోతుంది టీమ్ ఇండియా. గత ఏడాది కరోనా వైరస్ కారణంగా ఈ టెస్ట్ మ్యాచ్ వాయిదా పడిన విషయం తెలిసిందే. ఇక ఇప్పుడు ఇన్ని రోజుల తర్వాత వైరస్ ప్రభావం తగ్గిందని.. ఈ టెస్టు మ్యాచ్ రీ షెడ్యూల్ చేశారు. జూలై 1వ తేదీ నుంచి ఈ టెస్ట్ మ్యాచ్ జరగాల్సి ఉంది. అయితే ఇక ప్రస్తుతం కరోనా వైరస్ ప్రభావం తగ్గిందని టెస్ట్ మ్యాచ్ రీ షెడ్యూల్ చేస్తే.. ఇప్పుడు మరోసారి కరోనా వైరస్ ఇబ్బందులు సృష్టిస్తూనే ఉంది అని తెలుస్తుంది.


 కొంతకాలం నుంచి టీమ్ ఇండియా లో ఉన్న పలువురు ఆటగాళ్లు వైరస్ బారిన పడుతున్నారు. ఇటీవలే రోహిత్ శర్మ సైతం కరోనా వైరస్ బారిన పడ్డాడు అన్న విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే రోహిత్ శర్మ జులై 1వ తేదీ నుంచి జరగబోయే మ్యాచ్ కి అందుబాటులోకి వస్తాడా లేదా అన్నది కూడా హాట్ టాపిక్ గా మారిపోయింది అని చెప్పాలి. అదే సమయంలో ఒకవేళ రోహిత్ శర్మ అందుబాటులో లేకపోతే ఇక టీమిండియా కెప్టెన్సీ ఎవరికి అప్పగిస్తారు అన్న చర్చ కూడా మొదలయింది. ఈక్రమంలోనే రిషబ్ పంత్ తోపాటు జస్ప్రిత్ బూమ్రా పేర్లు ప్రధానంగా వినిపించాయి.


 అయితే ఇప్పుడు వరకు దీనిపై స్పష్టత మాత్రం రాలేదు అని చెప్పాలి. ఇకపోతే ఇటీవల బిసిసిఐ జూలై ఒకటో తేదీ నుంచి జరగబోయే టెస్ట్ మ్యాచ్ కి సంబంధించి కెప్టెన్ గా ఎవరు వ్యవహరించపోతున్నారు అన్నదానిపై స్పష్టత ఇచ్చింది. ఇంగ్లాండ్తో జరగబోయే ఐదో టెస్టులో టీమిండియా కెప్టెన్గా వ్యవహరించ పోతుందంట  జూలై ఒకటో తేదీ వరకు రోహిత్ కోలుకునే ప్రసక్తే లేదు కాబట్టి వైస్ కెప్టెన్ గా ఉన్న బుమ్రా కు కెప్టెన్సీ పగ్గాలు అప్పగించినట్లు ఇటీవల బీసీసీఐ అధికారిక ప్రకటన చేసింది. దీంతో జస్ ప్రీత్ బుమ్రా అభిమానులు అందరూ కూడా మురిసిపోతున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: