2013 లో భారత్ పాకిస్థాన్ మధ్య క్రికెట్ సంబంధాలు తెగిపోయాయి. ఈ క్రమంలోనే భారత్ పాకిస్తాన్ మధ్య ద్వైపాక్షిక సిరీస్లు అస్సలు జరగవు. ఒకవేళ ఈ రెండు దేశాల మధ్య పోరు చూడాలి అంటే ప్రపంచ కప్  రావాల్సిందే అన్న విషయం తెలిసిందే. రెండు దేశాల జట్ల మధ్య మ్యాచ్ జరుగుతుంది అంటే అది క్రికెట్ అభిమానులు అందరికి కూడా పండగే అని చెప్పాలి. ఈ క్రమంలోనే పాకిస్తాన్ భారత్ మధ్య మ్యాచ్ వస్తుందంటే కేవలం ఇరుదేశాల క్రికెట్ ప్రేక్షకులు మాత్రమే కాదు ప్రపంచవ్యాప్తంగా ప్రేక్షకులందరూ కూడా టీవీలకు అతుక్కుపోయి మ్యాచ్ వీక్షిస్తూ ఉంటారు. క్రికెట్ అంటే ఇష్టం లేనివారు సైతం పాకిస్తాన్ భారత్ మధ్య క్రికెట్ మ్యాచ్ చూడటానికి ఎక్కువగా ఆసక్తి చూపుతూ ఉంటారు అనడంలో అతిశయోక్తి లేదు అని చెప్పాలి. అయితే ఎప్పుడో ఒకసారి మాత్రమే జరిగే పాకిస్తాన్ భారత్ మ్యాచ్ లు 15 రోజులకు వ్యవధిలో మూడుసార్లు జరగబోతున్నాయి.


 ఆ వివరాలు ఇలా ఉన్నాయి.. 2022 ఆసియా కప్లో భాగంగా రెండు గ్రూపులుగా విభజించగా ఆరు జట్లు పాల్గొంటాయ్. ఇందులో గ్రూప్ ఏలో భారత్ పాకిస్తాన్ ఉన్నాయి.  గ్రూప్ బి లో శ్రీలంక ఆఫ్గనిస్తాన్ బంగ్లాదేశ్ ఉన్నాయి. ఇందులో భాగంగా ఆగస్టు 28న భారత్ పాకిస్తాన్ మధ్య  తొలి మ్యాచ్ జరగబోతోంది. ఇక గ్రూప్ దశలో రెండు మ్యాచ్లు ప్రతి జట్టు ఆడుతుంది. అందులో ఒక్క మ్యాచ్ గెలిచిన జట్టు సూపర్ 4 లో కొనసాగిస్తోంది. ఈ లెక్కన చూస్తే భారత్ పాకిస్తాన్ సూపర్ 4 చేరడం ఖాయంగానే కనిపిస్తోంది. సూపర్ ఫోర్ లో కూడా భారత్ పాకిస్తాన్ మ్యాచ్ వీక్షించేందుకు అవకాశం ఉంది.. సూపర్ 4 ముగిసిన తర్వాత సెప్టెంబర్ 11న ఫైనల్ మ్యాచ్ జరగబోతోంది. ప్రస్తుత ఫామ్ ని బట్టి భారత్-పాకిస్థాన్ జట్లు ఫైనల్ లోకి వచ్చే అవకాశం ఉంది. దీంతో మరోసారి ఇరు జట్లు తలపడతాయ్. ఇలా పదిహేను రోజుల వ్యవధిలోనే ఏకంగా మూడు సార్లు భారత్ పాకిస్తాన్ మధ్య మ్యాచ్ జరగబోతుంది అనేది తెలుస్తుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: