ప్రస్తుతం సౌత్ ఆఫ్రికా తో టీమ్ ఇండియా టి20 సిరీస్ ఆడుతుంది. అయితే ఈ టి 20 సిరీస్ లో భాగంగా టీమిండియా వరుసగా రెండు మ్యాచ్ లలో  విజయం సాధించింది అన్న విషయం తెలిసిందే   ఒక మ్యాచ్ మిగిలి ఉండగానే సిరీస్ కైవసం చేసుకుంది టీమిండియా.  ఇకపోతే అటు టీమిండియా విజయం అయితే సాధిస్తుంది. కానీ ఆశించిన స్థాయిలో బౌలింగ్ విభాగం మాత్రం ప్రదర్శన చేయలేక పోతుంది అన్నది మాత్రం ప్రస్తుతం అర్థం అవుతుంది. ఎందుకంటే ప్రత్యర్థులను కట్టడం చేయాల్సిన బౌలర్లు భారీగా పరుగులు సమర్పించుకుంటూ ఉండటం గమనార్హం. మరి కొన్ని రోజుల్లో టి20 వరల్డ్ కప్ ప్రారంభం కాబోతున్న నేపథంలో టీమిండియాలో ఇలాంటి బౌలింగ్ శైలి ఉండడం ఏ మాత్రం శుభసూచికం కాదు అని చెప్పాలి. అయితే రెండవ టి20 మ్యాచ్ లో భాగంగా తొలుత టాస్ ఓడి బ్యాటింగ్కు వచ్చింది భారత జట్టు. నిర్ణీత 20 ఓవర్లలో మూడు వికెట్ల నష్టానికి 237 పరుగుల భారీ స్కోర్ చేసింది. ఇక బ్యాట్స్మెన్లు అందరూ కూడా తమ బాధ్యత నెరవేర్చారు అని చెప్పాలి. ఇక భారీ టార్గెట్ తో బరిలోకి దిగిన సౌత్ ఆఫ్రికా మరోసారి పేలవంగానే ఆరంభించింది అని చెప్పాలి. కెప్టెన్ టెంప భావమా,  రౌసా డకౌట్ గా వెనుతిరిగాడు. దీంతో భారత్ భారీ తేడాతో విజయం సాధిస్తుందని అందరూ అనుకున్నారు.


 కానీ ఇక్కడే సీన్ మొత్తం మారిపోయింది అని చెప్పాలి. భారత బౌలర్లు కట్టుదిట్టంగా బౌలింగ్ వేయలేకపోయారు ఈ క్రమంలోనే మార్కరమ్ 19 బంతుల్లో 33 పరుగులు చేసి ఎదురు దాడికి దిగాడు. ఇక డేవిడ్ మిల్లర్, క్వింటన్ డికాక్ భారత బౌలర్లను ఊచ కోత కోశారు అని చెప్పాలి. ఇదే సమయంలో టీం ఇండియాను మరోసారి 19 ఓవర్ ఫోబియా వెంటాడింది. ఎంతో నమ్మకంతో అర్షదీప్ కి బౌలింగ్ ఇస్తే ఏకంగా ఒకే ఓవర్ లో 26 పరుగులు సమర్పించుకున్నాడు. తొలి ఓవర్లో రెండు వికెట్లు తీసినచివరకు నాలుగు ఓవర్లలో 63 పరుగులు సమర్పించుకుని తేలిపోయాడు. అక్షర్ పటేల్ అయితే 4 ఓవర్ లలో 53 పరుగుల సమర్పించుకోవడం గమనార్ హం. అందుకే టీమిండియా గెలిచినప్పటికీ టీమిండియా బౌలింగ్ విభాగం ప్రదర్శన పై మాత్రం కోచ్ రాహుల్ ద్రవిడ్ సీరియస్ గా ఉన్నాడట.  మరీ నేడు జరగబోయే మ్యాచ్ లో ఎలాంటి ప్రదర్శన చేస్తారో చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి: