
ఇటీవల వరల్డ్ కప్ లో భాగంగా ఇంగ్లాండ్ చేతిలో భారత జట్టు ఏకంగా 10 వికెట్ల తేడాతో చిత్తుగా ఓడిపోవడం.. అదే సమయంలో ఫైనల్లో పాకిస్తాన్ ఓడించి ఇక ఈ ఏడాది వరల్డ్ కప్ విజేతగా ఇంగ్లాండ్ నిలవడంపై స్పందించిన మైకల్ వాన్ ఏకంగా టీమిండియాను చులకన చేస్తూ మాట్లాడాడు. అంతేకాదు బీసీసీఐ విషయంలో కూడా షాకింగ్ కామెంట్స్ చేశాడు అని చెప్పాలి. ఏకంగా వరల్డ్ కప్ గెలిచిన గర్వం నెత్తికెక్కిందేమో అన్న విధంగా అతని వ్యాఖ్యలు ఉండడం గమనార్హం. ఇక మైకల్ వాన్ చేసిన వ్యాఖ్యలపై ఇండియా అభిమానులు తీవ్రస్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
ఇంతకీ అతను ఏమన్నాడు అంటే.. ఒకవేళ తానే గనుక బిసిసిఐ చైర్మన్ అయి ఉంటే అహంకారాన్ని తగ్గించుకుని ఇంగ్లాండు విన్నింగ్ మోడల్ స్ఫూర్తిగా తీసుకొని ఫాలో అవుతాను అంటూ షాకింగ్ కామెంట్స్ చేశాడు మైకల్ వాన్. మేజర్ టోర్నీలలో టీమిండియా గెలవాలి అంటే భారత క్రికెట్ నియంత్రణ మండలి తప్పకుండా ఇంగ్లాండ్ ను ఫాలో అవ్వాలి అంటూ సూచించాడు. ఇక మైకల్ వాన్ చేసిన వ్యాఖ్యలు కాస్త సంచలనంగా మారగా ఇక అతని కామెంట్స్ పై టీమిండియా అభిమానులు మాత్రమే కాదు మాజీ ఆటగాళ్లు సైతం సోషల్ మీడియా వేదికగా స్పందిస్తూ కౌంటర్లు ఇస్తూ ఉండడం గమనార్హం.