న్యూజిలాండ్ పర్యటనలో భాగంగా ప్రస్తుతం శిఖర్ ధావన్ కెప్టెన్సీలో వన్డే సిరీస్లో భాగంగా టీమిండియా జట్టు ప్రస్తుతం బిజీ బిజీగా ఉంది అన్న విషయం తెలిసిందే. అయితే ఒకవైపు అటు వరుణుడు ఆటంకం కలిగిస్తూ ఉన్నప్పటికీ ఇక మ్యాచ్లు నిర్వహించేందుకు శాయ శక్తుల ప్రయత్నిస్తున్నారు. ఇకపోతే ఎంతో హోరాహోరీగా జరిగిన మొదటి వన్డే మ్యాచ్లో భాగంగా అటు టీమ్ ఇండియా జట్టు ఓటమి చూసింది అన్న విషయం తెలిసిందే. అయితే ఇక మొదటి మ్యాచ్ లో ఓడిపోయినప్పటికీ మిగతా రెండు మ్యాచ్ లు మిగిలి ఉన్నాయి కాబట్టి ధావన్ సేన పుంజుకునేందుకు  అవకాశం ఉందని అందరు అనుకున్నారు.


 కానీ ఊహించనీ రీతిలో  మరోసారి టీమిండియా జట్టును అటు దురదృష్టం వెంటాడింది అని చెప్పాలి  ఈ క్రమంలోనే రెండో వన్డే మ్యాచ్ వర్షం కారణంగా రద్దయింది. తద్వారా రెండు వన్డే మ్యాచ్ గెలిచి సిరీస్ అవకాశాలను సజీవంగా ఉంచుకోవాలని భావిస్తున్న టీమ్ ఇండియాకు నిరాశ ఎదురైంది. ఈ క్రమంలోనే మూడవ వన్డే మ్యాచ్ ఎంతో కీలకంగా మారిపోయింది అని చెప్పాలి. అయితే మొదటి వన్డే మ్యాచ్లో బాగా రాణించిన సంజూ శాంసంగ్ ను ఇక అదనప బౌలర్ కావాలి అనే కారణం చెబుతూ రెండో వన్డే మ్యాచ్లో పక్కకు పెట్టేశారు.


 దీంతో బీసీసీఐపై తీవ్రస్థాయిలో విమర్శలు వచ్చాయని చెప్పాలి. ఇదే విషయంపై స్పందించిన టీమిండియా మాజీ ఆటగాడు ఆకాష్ చోప్రా ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు.  మూడో వన్డే మ్యాచ్లో సంజు శాంసన్ ను ఆడించడానికి ప్రయత్నించండి.. దీపక్ హుడా ఉండాలి. కుల్దీప్ యాదవ్ కి కూడా ఒక మ్యాచ్ ఛాన్స్ ఇవ్వండి. ఉమ్రాన్ మాలిక్ ను  కొనసాగించండి. సంజు శాంసన్ ను జట్టులో ఉంచడానికి ప్రయత్నించండి. ఒకవేళ సంజూ ను ఆడించక పోతే మాత్రం విమర్శలు ఎదుర్కోవాల్సి వస్తుంది. విమర్శలను ఎదుర్కోవడానికి సిద్ధంగా ఉంటే అతన్ని పక్కన కూర్చోబెట్టండి అంటూ అకాష్ చోప్రా వ్యాఖ్యానించాడు.

మరింత సమాచారం తెలుసుకోండి: