రేపటి నుండి బంగ్లా పులులతో భారత్ మూడు వన్ డే ల సిరీస్ ను మొదటగా ఆడనుంది. ఆ తర్వాత రెండు టెస్ట్ లను షెడ్యూల్ చేయడం జరిగింది. అయితే రేపు ఢాకా లోని షేర్ ఏ బంగ్లా స్టేడియం లో మొదటి వన్ డే జరగనుంది, ఇప్పటికే ఇరు జట్ల సభ్యులు మొదటి సవాల్ కు సిద్ధంగా ఉన్నారు. ఈ సిరీస్ ను గెలవడం బంగ్లాదేశ్ కన్నా భారత్ కు చాలా అవసరం. ఎందుకంటే ఇటీవల ముగిసిన న్యూజిలాండ్ వన్ డే సిరీస్ ను 0-1 తో ఓడిపోయిన సంగతి తెలిసిందే. అందుకే ఎలాగైనా ఈ సిరీస్ ను దక్కించుకుని సత్తా చాటాలని భారత్ బృందం ఎదురుచూస్తోంది.

ఇక ఈ సిరీస్ భారత్ బౌలర్లకు ఒక పెను సవాల్ అని చెప్పాలి. ఎందుకంటే అటు టీ 20 ప్రపంచ కప్ మరియు కివీస్ తో సిరీస్ లో బౌలర్లు పెద్దగా ఆకట్టుకోలేదు. అందుకే ఈ సిరీస్ లో అయినా బౌలర్లు రాణిస్తారా అని అభిమానులు మరియు భారత యాజమాన్యం లెక్కలు వేసుకుంటున్నారు. ఈ సిరీస్ కు ఎంపిక అయిన బౌలర్లలో , పేసర్లు శార్దూల్ ఠాకూర్ , మహమ్మద్ సిరాజ్ , దీపక్ చాహర్ , కుల్దీప్ సేన్ మరియు ఉమ్రాన్ మాలిక్ లు ఉన్నారు. ఇక స్పిన్నర్ ల విషయానికి వస్తే షాహబ్జ్ అహమ్మద్ , అక్షర్ పటేల్ , వాషింగ్టన్ సుందర్ లు ఉన్నారు.

ఇక వీరిలో తుది జట్టుకు ఎంపికయ్యే అవకాశం ఉన్న వారిలో గత సిరీస్ లో ఆల్ రౌండర్ గా రాణించిన వాషింగ్టన్ సుందర్ జట్టులో ఖచ్చితంగా ఉంటాడు , గత సిరీస్ కు రెస్ట్ తీసుకున్న అక్షర్ పటేల్ కూడా జట్టులోకి వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి. ఇక ఫాస్ట్ బౌలింగ్ లో జూనియర్ లేకనా సీనియర్ లకు అవకాశం దక్కుతుందని అంచనాలు ఉన్నాయి.. వారిలో దీపక్ చాహర్ , మహమ్మద్ సిరాజ్ మరియు శార్దూల్ ఠాకూర్ లు ఉంటారు. మరి వీరు అంతా రాణించి ఈ సిరీస్ ను భారత్ ఖాతాలో వేస్తారా అన్నది తెలియాలంటే ఈ సిరీస్ పూర్తయ్యే వరకు వేచి చూడాల్సిందే.  

 

మరింత సమాచారం తెలుసుకోండి: