మొన్నటికి మొన్న అటు న్యూజిలాండ్ పర్యటన ముగించుకున్న భారత జట్టు ప్రస్తుత బంగ్లాదేశ్ పర్యటనలో బిజీ బిజీగా  ఉంది అన్న విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే బంగ్లాదేశ్ పర్యటనలో భాగంగా వన్డే సిరీస్ తో పాటు టెస్ట్ సిరీస్ ఆడేందుకు సిద్ధమవుతుంది టీమ్ ఇండియా జట్టు. ఇప్పటికే వన్డే సిరీస్ ప్రారంభం కాగా ఇక ఇరు జట్లు కూడా హోరాహోరీగా  పోరాడుతూ ఉన్నాయని చెప్పాలి. అయితే ఇక బంగ్లాదేశ్ తో జరిగిన మొదటి వన్డే మ్యాచ్ లో జట్టులో కీలక ప్లేయర్గా కొనసాగుతున్న రిషబ్ పంత్ కు చోటు దక్కలేదు అని చెప్పాలి.


 గత కొంతకాలం నుంచి ఎంతలా పేలవ ప్రదర్శన చేస్తూ ఉన్నప్పటికీ అతనికి వరుసగా అవకాశాలు ఇస్తూ వచ్చింది భారత క్రికెట్ నియంత్రణ మండలి.  అయితే ఇటీవల  అతన్ని తుదిజట్టు నుంచి తప్పిస్తున్నట్లు నిర్ణయం తీసుకోవడం అందరిని ఆశ్చర్యానికి గురి చేసింది. బీసీసీఐ మెడికల్ టీం తో సంప్రదింపులు జరిపిన తర్వాతనే రిషబ్ పంతును జట్టు నుంచి పక్కకు తప్పించాము అంటూ బీసీసీఐ తెలిపింది. ప్రస్తుతం జట్టుకు దూరమైన రిషబ్ పంత్ ఇక బంగ్లాదేశ్ తో జరగబోయే టెస్ట్ సిరీస్ కు మాత్రం అందుబాటులోకి వస్తాడు అంటూ తెలిపింది.


 అతని స్థానంలో జట్టులోకి తీసుకునేందుకు అక్షర్ పటేల్ సైతం అందుబాటులో లేడు అన్న విషయాన్ని ఒక ప్రకటనలో తెలిపింది బీసీసీఐ. ఇక పంత్ లేకపోవడంతో అతని స్థానంలో కేఎల్ రాహుల్ వికెట్ కీపర్ బాధ్యతలు చేపట్టాడు. కాగా పంత్ ను తప్పించడం పై బీసీసీఐ ఏవేవో కారణాలు చెబుతున్నప్పటికీ గత కొంతకాలం నుంచి అతడు దారుణంగా విఫలమవుతూ ఉండడమే అతని జట్టు నుంచి తప్పించడానికి అసలైన కారణం అన్నది తెలుస్తుంది. అదే సమయంలో న్యూజిలాండ్తో జరిగిన ఆఖరి వన్డే మ్యాచ్ లో వెన్ను నొప్పితో బాధపడ్డాడు పంత్.  గాయం కారణంగానే అతని జట్టు నుంచి తప్పించారు అని మరికొంతమంది అభిప్రాయపడుతున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: