
ఇలా ఉన్నపలంగా సెలక్షన్ కమిటీని రద్దు చేయడం సంచలనంగా మారిపోయింది అని చెప్పాలి. ఈ క్రమంలోనే ఇక కొత్త బాస్ అధ్యక్షతన కొత్త సెలక్షన్ కమిటీలోకి ఎవరు రాబోతున్నారు అన్నది ఆసక్తికరంగా మారిపోయింది.. ఈ క్రమంలోనే కొత్త సెలెక్షన్ కమిటీ ఎంపిక కోసం ఇప్పటికే దరఖాస్తుల ప్రక్రియను కూడా పూర్తి చేసింది భారత క్రికెట్ నియంత్రణ మండలి. కానీ ఈ ప్రక్రియ పూర్తయి నెలలు కావస్తున్న ఇంకా కొత్త సెలెక్షన్ కమిటీ ఎంపిక ప్రక్రియ మాత్రం ఎక్కడ వేసిన గొంగళి అక్కడే అన్న విధంగా కొనసాగుతోంది అన్న విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే కొత్త సెలెక్షన్ కమిటీ ఎన్నికపై ప్రకటన గురించి అందరూ ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.
ఇకపోతే బిసిసిఐ కొత్త సెలక్షన్ కమిటీ వచ్చే ఏడాది జనవరిలో ఏర్పడనున్నట్లు తెలుస్తోంది. అశోక్ మలహోత్ర, జతిన్ పరంజపే, సులక్షణ నాయక్ లతో కూడిన క్రికెట్ సలహా మండలి ఇక ఈ కొత్త సెలక్షన్ కమిటీని ఎంపిక చేయబోతుందట. ఈ ముగ్గురు సభ్యుల కమిటీ డిసెంబర్ 30వ తేదీన కొత్త సెలక్షన్ కమిటీ కోసం దరఖాస్తు చేసిన వారికి ఇక ఇంటర్వ్యూలు నిర్వహించబోతుంది అన్నది తెలుస్తుంది. ఇక ఆ తర్వాత సెలెక్ట్ చేసిన కొత్త సెలెక్షన్ కమిటీ సభ్యుల వివరాలను ప్రకటించబోతుందట క్రికెట్ సలహా మండలి.