ప్రస్తుతం భారత జట్టు వరుసగా ద్వైపాక్షిక సిరీస్ లలో ఆడుతూ బిజీబిజీగా ఉంది అని చెప్పాలి. అయితే గత కొన్ని రోజుల నుంచి ఇక పరిమిత ఓవర్ల ఫార్మాట్లోనే ద్వైపాక్షిక సిరీస్ లు ఆడుతుంది టీమ్ ఇండియా.  ఇక భారత పర్యటనకు వచ్చిన విదేశీ జట్లను చిత్తు చేస్తూ వరుస విజయాలు సొంతం చేసుకుంటుంది అని చెప్పాలి. అయితే ఫిబ్రవరిలో మాత్రం టీమిండియా కు అసలు సవాలు ఎదురు కాబోతుంది. అటు భారత పర్యటనకు రాబోతున్న ఆస్ట్రేలియాతో బోర్డర్ గవాస్కర్ ట్రోఫీలో భాగంగా టెస్ట్ సిరీస్ ఆడబోతుంది.


 ఈ క్రమంలోనే ఇక ఈ కీలకమైన టెస్ట్ మ్యాచ్లో విజయం సాధించడం అటు టీమిండియా కు తప్పనిసరి అని చెప్పాలి. ఎందుకంటే వరల్డ్ టెస్ట్ ఛాంపియన్షిప్ ఫైనల్లో అడుగు పెట్టాలి అంటే అటు భారత పర్యటనకు వచ్చే ఆస్ట్రేలియాతో జరిగే టెస్ట్ సిరీస్ లో పూర్తి ఆదిపత్యాన్ని కనబరిచాల్సి ఉంటుంది. వరుసగా మూడు లేదా నాలుగు మ్యాచ్ లలో కూడా విజయం సాధించాల్సిన అవసరం ఉంది అని చెప్పాలి. ఈ క్రమంలోనే ఇక ఎవరి ప్రదర్శన ఎలా ఉంటుంది అనే దానిపై ఎంతో మంది మాజీ ఆటగాళ్లు తమ రివ్యూలను  సోషల్ మీడియాలో వ్యక్తపరుస్తూ ఉన్నారు.


 ఇక ఇటీవలే ఇదే విషయంపై మాట్లాడిన మాజీ బీసీసీఐ అధ్యక్షుడు సౌరబ్ గంగూలీ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. టీమిండియా రన్ మిషన్ కోహ్లీ టెస్ట్ ఫార్మాట్ లోను ఫామ్ను కంటిన్యూ చేయాల్సిన అవసరం ఉంది అంటూ చెప్పుకొచ్చాడు. భారత జట్టు అతడి పైన ఎక్కువగా ఆధారపడి ఉంది అంటూ తెలిపాడు.  ఎంతో బలమైన జట్టు తీవ్రంగా పోటీ ఉండడంతో సగం మందికి పైగా ఆటగాళ్లు జాతీయ జట్టులో చోటు సంపాదించుకోలేకపోతున్నారు అంటూ సౌరబ్ గంగూలీ వ్యాఖ్యానించాడు. వరల్డ్ టెస్ట్ ఛాంపియన్షిప్ ఫైనల్లో ఆస్ట్రేలియా భారత్ తలబడితే చూడాలని ఉంది అంటూ తన మనసులో ఉన్న మాట బయటపెట్టేసాడు సౌరబ్ గంగూలీ.

మరింత సమాచారం తెలుసుకోండి: