గత కొంతకాలం నుంచి కూడా శుభమన్ గిల్ తన బ్యాటింగ్ తో చెలరేగిపోతున్న తీరు అసమాన్యం అన్న విధంగా ఉంది అన్న విషయం తెలిసిందే. ఎందుకంటే అతను మ్యాచ్లో బరిలోకి దిగాడు అంటే చాలు సెంచరీ చేయడం పక్క అనే విధంగానే ప్రస్తుతం బ్యాటింగ్ విధ్వంసం కొనసాగిస్తూ ఉన్నాడు. ఫార్మాట్ తో సంబంధం లేకుండా సెంచరీలు, డబుల్ సెంచరీలు బాదుతూ ఇక ప్రపంచ క్రికెట్ ప్రేక్షకుల దృష్టిని తన వైపుకు తిప్పుకుంటున్నాడు అని చెప్పాలి. అంతేకాదు ఇక బ్యాటింగ్ చేస్తున్న సమయంలో ఎంతో సొగసైన షాట్లు ఆడుతూ అతనికి తిరుగులేదు అనే విధంగానే విధ్వంసాన్ని కొనసాగిస్తూ ఉన్నాడు.


 ఇప్పటికే డబల్ సెంచరీలు సెంచరీలతో ఎన్నో అరుదైన రికార్డులు సృష్టించిన శుభమన్ గిల్ ఇక ఇటీవలే మరోసారి సెంచరీ తో చెలరేగిపోయాడు అన్న విషయం తెలిసిందే. సెంచరీ చేయడం అంటే అనుకున్నంత ఈజీ కాదు. అది టి20 ఫార్మాట్ లో అయితే అది ఒక కఠినమైన సవాల్ అని అందరూ చెబుతున్న సమయంలో మంచినీళ్లు తాగినంత ఈజీగా సెంచరీలు చేసేస్తూ వున్నాడు శుభమన్ గిల్. ఇటీవల న్యూజిలాండ్ తో జరిగిన మూడవ టి20 మ్యాచ్ లో కూడా సెంచరీలతో చెలరేగిపోయి టీమ్ ఇండియా విజయం లో కీలకపాత్ర వహించాడు.


 కేవలం 23 ఏళ్ల వయసులోనే ఈ రేంజ్ సంచలనం కొనసాగిస్తూ ఉండడంతో.. ఇక మాజీ ఆటగాళ్ళు అతని ప్రతిభను ఆకాశానికి ఎత్తేస్తూ ఉన్నారు అని చెప్పాలి. ఇక ఇటీవల న్యూజిలాండ్తో జరిగిన మూడవ టి20 మ్యాచ్ లో కూడా సెంచరీ చేయడం ద్వారా ఎన్నో అరుదైన రికార్డులు సృష్టించాడు. ఇటీవల సెంచరీ ద్వారా ఇక అన్ని ఫార్మాట్లలో కూడా శుభమన్ గిల్ సెంచరీ చేసినట్లు అయింది. ఇలా అతి తక్కువ వయసులోనే అన్ని ఫార్మట్లలో సెంచరీలు సాధించిన ఆటగాడిగా రికార్డు సృష్టించాడు. అంతేకాదు టి20 ఫార్మాట్లో సెంచరీ చేసిన భారత యంగెస్ట్ ప్లేయర్ గిల్ కావడం గమనార్హం.  ఇక అంతేకాదు శుభమన్ గిల్ చేసిన పరుగులే ఇప్పటివరకు టి20 ఫార్మాట్ లో భారత్ తరపున అత్యధిక పరుగులు.

మరింత సమాచారం తెలుసుకోండి: