కొన్ని దశాబ్దాల నుంచి కూడా బోర్డర్ గవాస్కర్ ట్రోఫీలో భాగంగా ఆస్ట్రేలియా, ఇండియా జట్ల మధ్య హోరాహోరీ పోరు జరుగుతూ ఉంది అన్న విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే ఒకరిపై ఒకరు పై చేయి సాధించేందుకు ఇరు జట్లు కూడా ఎప్పుడు పోటీ పడుతూనే ఉన్నాయి. అయితే ఇక ఇప్పుడు ఈ ప్రతిష్టాత్మకమైన సిరీస్ కి మరోసారి సమయం ఆసన్నమైంది అన్న విషయం తెలిసిందే. బోర్డర్ గవాస్కర్ ట్రోఫీలో భాగంగా నాలుగు మ్యాచ్ల టెస్ట్ సిరీస్ ఆడేందుకు ఇప్పటికే ఆస్ట్రేలియా జట్టు భారత గడ్డపై అడుగుపెట్టి ప్రాక్టీస్ లో మునిగి తేలుతుంది.


 రేపటి నుంచి ఈ సిరీస్ ప్రారంభం కాబోతుంది అన్న విషయం తెలిసిందే. మొదటి మ్యాచ్ నాగపూర్ వేదికగా జరగబోతుంది. ఇకపోతే దాదాపు గత మూడు సీజన్ల నుంచి కూడా టీమ్ ఇండియా అనే పైచేయి సాధిస్తూ సిరీస్ కైవసం చేసుకుంటూ వస్తుంది.  ఇక ఇప్పుడు సొంత గడ్డపై బోర్డర్ గువాస్కర్ ట్రోఫీ జరుగుతున్న నేపథ్యంలో ఇక టీం ఇండియాదే సిరీస్ అని అందరూ భావిస్తూ ఉన్నారు. అయితే ఈ ప్రతిష్టాత్మకమైన సిరీస్ నేపథ్యంలో ఇక గత గణాంకాలు కూడా ప్రస్తుతం హాట్ టాపిక్ గా మారిపోతున్నాయి అని చెప్పాలి.


 ముఖ్యంగా బోర్డర్ గవాస్కర్ ట్రోఫీలో భాగంగా డబుల్ సెంచరీ చేసి రికార్డు సృష్టించిన భారత బ్యాట్స్మెన్లు ఎవరు అన్నది హాట్ టాపిక్ గా మారిపోయింది. ఆ వివరాలు చూసుకుంటే.. వివిఎస్ లక్ష్మణ్, సచిన్ టెండూల్కర్,  రాహుల్ ద్రవిడ్, మహేంద్రసింగ్ ధోని,  గౌతమ్ గంభీర్ బోర్డర్ గవాస్కర్   ట్రోఫీలో డబుల్ సెంచరీ సాధించారూ. ఇక ప్రస్తుతం ఉన్న జట్టులో అయితే చటిశ్వర్ పూజార మినహా ఏ ఒక్క ఆటగాడు కూడా ఆస్ట్రేలియాపై డబుల్ సెంచరీ చేయలేదు అని చెప్పాలి. ఇక వీరిలో బివిఎస్  లక్ష్మణ్ సచిన్ టెండూల్కర్, పూజార ముగ్గురు మాత్రమే  ఆసీస్ పై రెండుసార్లు డబుల్ సెంచరీ మార్క్ అందుకున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: