
అతనితోపాటు గాయాల బారిన పడిన ఆటగాళ్లు ఎంతో మంది జట్టులోకి వచ్చారు. కానీ బుమ్రా మాత్రం ఎనిమిది నెలలు కావస్తున్న ఇంకా టీమిండియా తరఫున ఆడటం లేదు. ఆస్ట్రేలియాతో జరుగుతున్న టెస్ట్ సిరీస్ లో అతను అందుబాటులోకి వస్తాడని అందరూ భావించారు. కానీ ఊహించిన రీతిలో బుమ్రా అందుబాటులో లేకుండానే పోయాడు అన్న విషయం తెలిసిందే. అయితే ఐపీఎల్ లో ఆడటం కోసమే బుమ్రా ఇలా భారత జట్టుకు దూరంగా ఉంటున్నాడు అంటూ ఎంతో మంది విమర్శలు గుప్పిస్తున్నారు అని చెప్పాలి. ఇక ఇటీవలే ఇదే విషయంపై భారత మాజీ ఆటగాడు ఆకాష్ చోప్రా కూడా స్పందించాడు.
ఐపీఎల్ లో బుమ్రా ఏడు మ్యాచ్లు ఆడకపోయినంత మాత్రాన ప్రపంచం ఏమీ మునిగిపోదు అంటూ ఆకాష్ చోప్రా ఘాటు వ్యాఖ్యలు చేశాడు అని చెప్పాలి. ఫిట్నెస్ లేకపోతే కొన్ని మ్యాచ్లు ఆడకుండా బీసీసీఐ చూడాలి అంటూ కామెంట్ చేశాడు ఆకాష్ చోప్రా. ముందు భారత్ ఆ తర్వాతే ఫ్రాంచైజీ ప్లేయర్ అంటూ వ్యాఖ్యానించాడు. అయితే బుమ్రా అభిమానులు సైతం అతని తీరుపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఫ్రాంచైజీ క్రికెట్కు ఇంతలా ప్రాధాన్యత ఇవ్వాల్సిన అవసరం ఏముంది అంటూ సోషల్ మీడియా వేదికగా ప్రశ్నల వర్షం కురిపిస్తూ ఉన్నారు అని చెప్పాలి.