గత కొంతకాలం నుంచి టీమిండియా యువ సంచలనం పృథ్వి షా తరచూ వార్తల్లో నిలుస్తూ ఉన్నాడు  అనే విషయం తెలిసిందే. అయితే ఒకప్పుడు తన ఆట తీరుతో వార్తల్లో నిలిచిన పృథ్వి షా ఇటీవల కాలంలో జట్టులో చోటు సంపాదించుకోకపోవడం కారణంగా వార్తల్లో హాట్ టాపిక్ గా మారిపోతూ ఉన్నాడు. అతను టీమిండియా తరఫున మ్యాచ్ ఆడి దాదాపు ఏడాది పైగానే గడిచిపోతుంది అని చెప్పాలి. ఇక పృద్విషాకు టీమిండియాలో చోటు దక్కుతుంది అని ఎదురు చూడటం ఇక సెలక్టర్లు అతని పట్టించుకోకపోవడంతో తన అసంతృప్తిని సోషల్ మీడియా వేదికగా పోస్టులు పెట్టి వ్యక్త పరచడం లాంటివి చేస్తూ ఉన్నాడు.


 అంతేకాకుండా ఇక ఇటీవల కాలంలో తరచూ ఏదోక వివాదంలో ఇరుక్కుంటూ సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారిపోతూనే ఉన్నాడు పృథ్వి షా అని చెప్పాలి. మొన్నటికి మొన్న ఏకంగా పృథ్వి షాపై దాడి జరిగిన ఘటన కూడా సంచలనగా మారిపోయింది. అంతేకాదుండోయ్ ఇక లవ్ బ్రేకప్ లతో కూడా ఈ యువ క్రికెటర్ ఎప్పుడు వార్తల్లో నానుతూనే  ఉన్నాడు. ఇకపోతే ఇటీవలే స్టార్ ప్లేయర్ పృథ్వి షా ఇంస్టాగ్రామ్ వేదికగా పెట్టిన స్టోరీ గురించి ప్రస్తుతం నేటిజన్స్ అందరూ కూడా చర్చించుకుంటున్నారు.


 కొంతమంది మనల్ని వాడుకునేంతవరకు కూడా ఐలవ్యూ చెబుతారు. వారికి వచ్చే బెనిఫిట్స్ ఒకవేళ ఆగిపోతే.. ఇక అక్కడ వారి విధేయత కూడా ముగిసిపోతూ ఉంటుంది అంటూ పృథ్వి షా ఇంస్టాగ్రామ్ లో స్టోరీ లో ఒక పోస్ట్ పెట్టాడు. దీంతో ఇది చూసి అభిమానులు అందరూ కూడా షాక్ అవుతున్నారు. పృద్విషాకు ఏమైంది మళ్లీ లవ్ ఫెయిల్యూర్ అయిందా ఏంటి అని సోషల్ మీడియా వేదికగా నేటిజన్స్ అందరూ కూడా ప్రశ్నిస్తున్నారు అని చెప్పాలి. మరి కొంతమంది  పృద్వి షా ఈ మధ్య ఏం మాట్లాడుతున్నారో అసలు అర్థం కావడం లేదు అంటూ కామెంట్లు చేస్తూ ఉండడం గమనార్హం.

మరింత సమాచారం తెలుసుకోండి: