టీమిండియా వెటరన్ పేసర్‌ అయిన భువనేశ్వర్‌ కుమార్‌ కి భారత క్రికెట్‌ నియంత్రణ మండలి(బీసీసీఐ) దిమ్మ తిరిగి మైండ్ బ్లాక్ అయ్యే పెద్ద షాకిచ్చింది. తమ వార్షిక కాంట్రాక్ట్‌ జాబితా నుంచి భువనేశ్వర్‌ కుమార్ ను బీసీసీఐ తొలిగించింది.బీసీసీఐ తాజగా ప్రకటించిన వార్షిక కాంట్రాక్ట్‌ లిస్ట్‌లో స్టార్ పేసర్ భువనేశ్వర్‌ కుమార్‌కు స్థానం దక్కలేదు. భువీతో పాటు సీనియర్‌ ఆటగాళ్లు అయిన అజింక్య రహానే, ఇషాంత్‌ శర్మలు కూడా తమ కాంట్రాక్ట్‌లను కోల్పోయారు.కాగా ఫామ్‌ కోల్పోయి ఎంతగానో ఇబ్బంది పడుతున్న భువీని భారత సెలక్టర్లు పక్కన పెట్టారు. గత సంవత్సరం ఆసియాకప్‌ నుంచి భువీ చాలా దారుణమైన ప్రదర్శన కనబరిచాడు. ఆసియాకప్‌-2022లో ఆప్గానిస్తాన్‌పై తప్ప అంతగా చెప్పుకోదగ్గ ప్రదర్శన ఏమీ భువీ చేయలేదు. ఇంకా అదే విధంగా స్వదేశంలో ఆస్ట్రేలియాతో జరిగిన సిరీస్‌లో  కూడా భువనేశ్వర్‌ కుమార్ ఎంతగానో విఫలమయ్యాడు.ఆ తరువాత టీ20 ప్రపంచకప్‌లో కూడా తన చెత్త ఫామ్‌ను భువీ కొనసాగించాడు. ఇక ప్రపంచకప్‌లో కూడా ఆరు మ్యాచ్‌లు ఆడిన భువనేశ్వర్‌ కేవలం 4వికెట్లు మాత్రమే పడగొట్టాడు. ముఖ్యంగా ఇంగ్లండ్‌ టీంతో జరిగిన సెమీఫైనల్లో అయితే రెండు ఓవర్లు వేసిన భువనేశ్వర్‌ కుమార్ చాలా దారుణంగా ఏకంగా 25 పరుగులు సమర్పించుకున్నాడు.


ఇక గత సంవత్సరం టీ20 ప్రపంచకప్‌ నుంచి భువీ భారత జట్టుకు చాలా దూరంగా ఉన్నాడు. ఇక భువీ తన వార్షిక కాంట్రాక్ట్‌ కూడా కోల్పోవడంతో మళ్లీ రీ ఎంట్రీ ఇవ్వడం చాలా కష్టమని క్రికెట్‌ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. భువీ ప్రస్తుతం ఐపీఎల్‌-2023 సీజన్‌ కోసం రెడీ అవుతున్నాడు. అతడు ఇప్పటికే సన్ రైజర్స్ హైదరాబాద్ జట్టుతో కలిసి ప్రాక్టీస్‌ సెషన్స్‌లో బాగా బీజీబీజీగా గడుపుతున్నాడు.ఇక బీసీసీ సెంట్రల్‌ కాంట్రాక్ట్‌ జాబితాలో మొత్తం 26 మంది ప్లేయర్స్ ఉన్నారు.'ఎ ప్లస్‌' గ్రేడ్‌ (రూ. 7 కోట్లు) లో  రోహిత్, కోహ్లి, బుమ్రా, జడేజా ఉన్నారు. 'ఎ' గ్రేడ్‌ (రూ. 5 కోట్లు)లో హార్దిక్‌ పాండ్యా, అశ్విన్, షమీ, రిషభ్‌ పంత్, అక్షర్‌ పటేల్‌ వున్నారు. ఇక 'బి' గ్రేడ్‌ (రూ. 3 కోట్లు) లో పుజారా, కేఎల్‌ రాహుల్, శ్రేయస్‌ అయ్యర్, సిరాజ్, సూర్యకుమార్‌ యాదవ్, శుబ్‌మన్‌ గిల్‌ ఉన్నారు. అలాగే 'సి' గ్రేడ్‌ (రూ. 1 కోటి) లో ఉమేశ్‌ యాదవ్, శిఖర్‌ ధావన్, శార్దుల్‌ ఠాకూర్, ఇషాన్‌ కిషన్, దీపక్‌ హుడా, యజువేంద్ర చహల్, కుల్దీప్‌ యాదవ్, వాషింగ్టన్‌ సుందర్, సంజూ సామ్సన్, అర్ష్‌దీప్‌ సింగ్, కోన శ్రీకర్‌ భరత్‌ ఉన్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: