
దీంతో ఇంకా 41 బంతులు మిగిలి ఉండగానే టార్గెట్ ను అందుకుంది రాజస్థాన్ రాయల్స్ జట్టు. ఈ క్రమంలోనే ఐపీఎల్ హిస్టరీలో రాజస్థాన్ ఒక అరుదైన రికార్డును సాధించింది. అతిపెద్ద విజయాన్ని నమోదు చేసింది. 150 అంతకన్నా ఎక్కువ టార్గెట్ ను అత్యంత వేగంగా చేదించిన రెండో జట్టుగా రాజస్థాన్ రాయల్స్.. ఐపీఎల్ హిస్టరీలో నిలిచిపోయింది అని చెప్పాలి. ఇక ఈ లిస్టులో తొలుత దక్కన్ చార్జెస్ ఉంది. 2008లో ముంబై ఇండియన్స్ పై 48 బంతులు మిగిలి ఉండగానే టార్గెట్ ను అందుకుంది దక్కన్ చార్జెస్.
ఇక ఈ లిస్టులో మూడో స్థానంలో ముంబై ఇండియన్స్ ఉండడం గమనార్హం. 2008లో ముంబై ఇండియన్స్ చెన్నై సూపర్ కింగ్స్ పై 37 బంతులు మిగిలి ఉండగానే టార్గెట్ చేదించి ఘనవిజయాన్ని అందుకుంది. అయితే ఈ మూడు సందర్భాల్లోనూ రెండు సార్లు సెంచరీలు నమోదు కాగా.. ఒకసారి అర్థ సెంచరీ నమోదయింది. ఇక ముగ్గురు బ్యాట్స్మెన్లు నాట్ ఔట్ గా నిలవడం విశేషం. అయితే 2008లో దక్కన్ చార్జెస్ ఓపెనర్ ఆడడం గిల్ క్రిస్ట్ 47 బంతుల్లోనే 109 పరుగులు చేసి నాటౌట్ గా నిలిచాడు. 2008లో ముంబై ఇండియన్స్ ఓపెనర్స్ జయ సూర్య 48 బంతులో 114 పరుగులు చేశాడు. ఇక ఇటీవల యశస్వి 47 బంతుల్లో 97 నాట్ అవుట్ గా వీరోచిత ఇన్నింగ్స్ ఆడాడు.