
అయితే ఇక ఈ మ్యాచ్ లో మరోసారి అభిమానులకు ధోని ఆటను చూసే అవకాశం లభించింది అన్న విషయం తెలిసిందే. ఇక చివరి ఓవర్ మిగిలి ఉన్నప్పుడు ధోని బ్యాటింగ్ చేయడానికి క్రీజులోకి వచ్చాడు అయితే ధోని ఈ మ్యాచ్ లో ఆడింది కేవలం ఐదు బంతులు మాత్రమే. ఈ ఐదు బంతుల్లో అతను చేసింది కేవలం నాలుగు పరుగులు.. అయినప్పటికీ స్టేడియం మొత్తం ధోని నామస్మరణతో మారుమోగిపోయింది అనడంలో సందేహం లేదు. అయితే అసలు మ్యాచ్ జరుగుతుంది ఢిల్లీ హోమ్ గ్రౌండ్ అయినా అరుణ్ జైట్లీ స్టేడియంలో కానీ అక్కడ సపోర్టు మొత్తం చెన్నై సూపర్ కింగ్స్ కే ఉంది అని చెప్పాలి.
ఎందుకంటే ఢిల్లీ ఎప్పుడో ప్లే ఆఫ్ రేస్ నుంచి నిష్క్రమించింది. దీంతో ఢిల్లీ అభిమానులు సైతం సీఎస్కే జెర్సీ వేసుకొని చెన్నై జట్టుకు మద్దతు పలికారు. అయితే ఇక ధోని మైదానంలోకి అడుగు పెట్టాడు అంటే చాలు అటు అభిమానులు అందరూ కూడా ధోని నామస్మరణతో పరవశించిపోతున్నారు అని చెప్పాలి ఇక ధోని క్రేజ్ ముందు ప్రత్యర్థి బౌలర్లు సరైన బంతులు వేయడంలో విఫలమవుతున్నారు. ఇటీవల ఢిల్లీతో మ్యాచ్ సమయంలో ఇది మరోసారి నిరూపితమైంది. చెన్నై ఇన్నింగ్స్ సమయంలో ఆఖరి ఓవర్ బౌలింగ్ చేశాడు చేతన్ సకారియా. ధోని అభిమానుల అరుపులతో అతను ఒత్తిడికి గురయ్యాడు. చివరి రెండు బంతులు వేయాల్సిన సమయంలో ఒకటి నోబాల్ మరొకటి వైడ్ బాల్ వేశాడు. ఎందుకురా బాబు నాకు ధోనికి బౌలింగ్ చేసే అవకాశం వచ్చింది అని లోలోపల అనుకుంటూనే భయపడుతూ బంతులు వేశాడు. దీనికి అంతటికి కారణం ధోని. ఇలా ధోని క్రేజ్ ముందు బంతులు వేయడానికి కూడా భయపడిపోతున్నారు బౌలర్లు.