ఇండియన్ ప్రీమియర్ లీగ్ లో ఎప్పుడు ప్రేక్షకుల అంచనాలు తారుమారు అవుతూ ఉంటాయి. బాగా రాణిస్తారు అనుకున్న స్టార్ ప్లేయర్స్ వరుస వైఫల్యాల తో ఇబ్బంది పడి నిరాశ పరిస్తే.. ఇక ఎలాంటి అంచనాలు లేకుండా ఐపిఎల్ లో అడుగుపెట్టిన యంగ్ ప్లేయర్స్ మాత్రం తమ ప్రదర్శన తో సంచలనం సృష్టిస్తూ ఉంటారు అని చెప్పాలి. ఇక ఎప్పటిలాగానే 2023 ఐపీఎల్ సీజన్లోనూ ఎంతో మంది యంగ్ ప్లేయర్స్ తో ప్రతిభతో ఆకట్టుకున్నారు. అంచనాలు పెట్టుకుని కొందరు స్టార్ ప్లేయర్స్ మాత్రం తీవ్రంగా నిరాశపరిచారు అని చెప్పాలి.



 తమ అనుభవంతో తమ ప్రతిభతో వండర్స్ చేస్తారు అనుకున్న సీనియర్ ప్లేయర్స్.. చివరికి చెత్త ప్రదర్శనలతో జట్టుకు భారంగా మారిపోయారు అని చెప్పాలి. ఇక ఇలాంటి ప్లేయర్లలో శ్రీలంక కెప్టెన్ దాసన్ శనక కూడా ఒకరు. గుజరాత్ టైటాన్స్ తరఫున ఆడుతున్నాడు దాసన్ శనక. అయితే ఈ సీజన్లో చాలానే అవకాశాలు దక్కించుకున్న చెప్పుకోదగ్గ ఇన్నింగ్స్ మాత్రం ఒక్కటి కూడా ఆడలేకపోయాడు. కెన్ విలియంసన్ స్థానంలో లీగ్ లోకి అడుగుపెట్టిన దాసున్ శనక అవకాశాన్ని సద్వినియోగం చేసుకోలేకపోయాడు.



 మూడు మ్యాచ్ లలో అవకాశాలు దక్కించుకున్న షనక కేవలం 26 పరుగులు మాత్రమే చేశాడు. ఇటీవల చెన్నైతో జరిగిన మొదటి క్వాలిఫైయర్ మ్యాచ్లో కీలక ఇన్నింగ్స్ ఆడాల్సింది పోయి 17 పరుగులు మాత్రమే చేసి వికెట్ సమర్పించుకున్నాడు. దీంతో వీరేంద్ర సెహ్వాగ్ అతనిపై విమర్శలు చేస్తూ నిప్పులు చెరిగాడు. గుజరాత్ తరపున  శనక తీవ్రంగా నిరాశపరిచాడు. అతన్ని జట్టులో నుంచి పక్కన పెడితే బాగుంటుంది. అతని అలాగే టీంలో కొనసాగిస్తే  గుజరాత్ కి ఎదురుదెబ్బ తప్పదు అంటూ హెచ్చరించాడు వీరేంద్ర సెహ్వాగ్. ఇకపోతే ఇటీవల క్వాలిఫైయర్ రెండవ మ్యాచ్ లో ముంబై పై గెలిచిన గుజరాత్ ఫైనల్లో చెన్నై సూపర్ కింగ్స్ తో తలబడపోతుంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

Ipl