భారత క్రికెట్లో టెస్ట్ స్పెషలిస్ట్ ప్లేయర్ గా పేరున్న అజింక్య రహానే ఇక సీనియర్ ప్లేయర్గా ముద్ర పడటంతో గత కొంతకాలం నుంచి జట్టుకు దూరమయ్యాడు అన్న విషయం తెలిసిందే. అయితే ఇక అతని కెరియర్ ముగిసిపోయింది అని అందరూ అనుకున్నారు. ఇలాంటి సమయంలోనే ఐపీఎల్లో అజింక్య రహానేకు లక్కీ ఛాన్స్ దక్కింది. చెన్నై సూపర్ కింగ్స్ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోని అజింక్య రహనేపై నమ్మకం ఉంచి. ఇక జట్టులో ఛాన్స్ ఇచ్చాడు. ఇక తుది జట్టులో కూడా చోటు కల్పించాడు. అయితే వచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకున్నాడు అజింక్య రహనే. కెరియర్ ముగిసిపోయింది అనుకుంటున్న సమయంలో తన రెగ్యులర్ ఆట తీరుకు భిన్నంగా మెరుపు ఇన్నింగ్స్ లను ఆడాడు.


 ఇలా ఐపిఎల్ లో అద్భుతమైన ప్రదర్శన చేసి అటు టీమ్ ఇండియా విజయంలో కీలక పాత్ర వహించాడు అని చెప్పాలి. అయితే ఇక ఐపీఎల్ లో అజింక్య రహనే ఫామ్ చూసిన సెలెక్టర్లు వెంటనే అతనికి వరల్డ్ టెస్ట్ ఛాంపియన్షిప్ ఫైనల్ మ్యాచ్లో కూడా ఛాన్స్ ఇచ్చారు. అయితే టి20 ఫార్మాట్లో మెరుపులు మెరిపించిన అజింక్య రహానే.. అటు వెంటనే టెస్ట్ ఫార్మాట్ కి సర్దుకు పోతాడా లేదా అని అందరూ భావించారు. అయితే ఇక ఇటీవల టాప్ ఆర్డర్ బ్యాట్స్మెన్లు అందరూ కూడా విఫలమైన సమయంలో  రహానే జట్టును ఆదుకున్నాడు. 129 బంతుల్లో 86 పరుగులు చేసి జట్టుకు గౌరవప్రదమైన స్కోర్ అందించాడు అని చెప్పాలి.


 ఈ క్రమంలోనే ఈ ఇన్నింగ్స్   ద్వారా ఒక అరుదైన రికార్డును కూడా తన ఖాతాలో వేసుకున్నాడు అని చెప్పాలి. టెస్ట్ ఫార్మాట్లో 5000 పరుగులు పూర్తి చేశాడు. ఈ క్రమంలోనే టెస్ట్ ఫార్మాట్లో ఈ ఘనత సాధించిన లెజెండ్స్ సరసన చేరిపోయాడు  రహనే. ఇక ఆ లిస్టు చూసుకుంటే సచిన్ టెండూల్కర్, రాహుల్ ద్రావిడ్, సునీల్ గవాస్కర్, వివిఎస్ లక్ష్మణ్, వీరేంద్ర సెహ్వాగ్, విరాట్ కోహ్లీ, గంగూలి, పూజార, దిలీప్, అజారుద్దీన్, కపిల్ దేవ్, గుండప్ప విశ్వనాథ్ సరసన చేరిపోయాడు రహనే. ఏది ఏమైనా అతని ఇన్నింగ్స్ మాత్రం అటు భారత జట్టు గౌరవాన్ని నిలబెట్టింది అని చెప్పాలి.

మరింత సమాచారం తెలుసుకోండి: