
అదిరిపోయే ప్రదర్శన చేసి ఆస్ట్రేలియాపై పూర్తి ఆదిపత్యం చెలాయిస్తుంది అనుకుంటే కనీస పోటీ ఇవ్వలేక ఇక ఓటమిని కొనితెచ్చుకున్నట్లుగానే కనిపిస్తుంది టీమిండియా ప్రదర్శన. ఈ క్రమంలోనే టీమ్ ఇండియా వరల్డ్ టెస్ట్ ఛాంపియన్షిప్ ఫైనల్ మ్యాచ్లో గెలుస్తుందా లేకపోతే 2021 లో న్యూజిలాండ్ చేతిలో ఓడిపోయిన సీన్ మళ్ళీ రిపీట్ అవుతుందా అనే విషయం పైనే కన్ఫ్యూజన్ లో పడిపోయారు భారత అభిమానులు. మూడో రోజు ఆట ముగిసే సమయానికి టీం ఇండియా 296 పరుగుల వెనుకంజలో ఉంది అని చెప్పాలి. మూడో రోజు ఆస్ట్రేలియా రెండో ఇన్నింగ్స్ లో నాలుగు వికెట్ల నష్టానికి 123 పరుగులు చేసింది.
ప్రస్తుతం కామరూన్ గ్రీన్ 7, లబుషేన్ 41 పరుగులతో క్రీజులో ఉన్నారు. కాగా రవీంద్ర జడేజా రెండు వికెట్లు, ఉమేష్ యాదవ్, సిరాజ్ చేరో ఒక వికెట్ తీశారు. ఇక అంతకుముందు టీమిండియా తొలి ఇన్నింగ్స్ లో 296 పరుగులు మాత్రమే చేసి ఆలౌట్ అయింది. అయితే ఇక ఇప్పుడు టీమ్ ఇండియా ముందు ఒక పెద్ద సవాల్ ఉంది అని చెప్పాలి. నాలుగో రోజు తొలి సెషన్లోనే ఆస్ట్రేలియాను ఆల్ అవుట్ చేయాల్సిన పరిస్థితి ఉంది. లేదంటే ఇక టీమిండియా కు కష్టాలు తప్పవు అని చెప్పాలి. ఏం జరుగుతుందో చూడాలి మరి. నాలుగు రోజు ఆటలో అయిన టీమ్ ఇండియా మంచి కం బ్యాక్ ఇవ్వాలని ఫ్యాన్స్ అందరూ బలంగా కోరుకుంటున్నారు.