
తన ఫాస్ట్ బౌలింగ్తో టీమ్ ఇండియా విజయం లో కీలక పాత్ర వహిస్తూ ఉన్నాడు అని చెప్పాలి. అయితే ఇలా అద్భుతమైన ప్రదర్శన చేస్తూ ఇక ఐసిసి ర్యాంకింగ్లో తన స్థానాన్ని మరింత మెరుగుపరుచుకుంటూ వస్తున్నాడు అని చెప్పాలి. ముఖ్యంగా ఆసియా కప్ 2023 ఫైనల్ లో సిరాజ్ చేసిన ప్రదర్శనని ప్రపంచ క్రికెట్ ప్రేక్షకులు అస్సలు మరిచిపోలేరు. ఏకంగా శ్రీలంక జట్టు ఓడిపోవడానికి సిరాజ్ బౌలింగ్ కారణం అనడంలో సందేహం లేదు. ఒకే ఒక్క ఓవర్లో నాలుగు వికెట్లు తీసి మ్యాచ్ స్వరూపాన్ని మొత్తం ఒక్కసారిగా మార్చేస్తాడు. మొత్తంగా ఫైనల్ మ్యాచ్ లో ఆరు వికెట్లు తీసి సత్తా చాటాడు మహమ్మద్ సిరాజ్.
ఇలాంటి అద్భుతమైన ప్రదర్శన చేయడం కారణంగా ఇటీవల ఇంటర్నేషనల్ క్రికెట్ కౌన్సిల్ ప్రకటించిన ర్యాంకింగ్స్ లూ ఒకేసారి 8 స్థానాలు ఎగబాకాడు అని చెప్పాలి. ఈ క్రమంలోనే మరోసారి అగ్ర పీఠాన్ని కైవసం చేసుకున్నాడు ఈ హైదరాబాది బౌలర్. ఆస్ట్రేలియా బోలర్ హెజిల్ వుడ్ ను వెనక్కినట్టు 694 రేటింగ్ పాయింట్లతో టాప్ లోకి దూసుకు వెళ్ళాడు. శ్రీలంకతో జరిగిన ఆసియా కప్ ఫైనల్లో సిరాజ్ ఆకాశమే హద్దుగా చెలరేకపోయినా నేపథ్యంలో ఇలా అగ్రస్థానం దక్కింది అన్నది తెలుస్తుంది. ఇక ఈ విషయం తెలిసి సిరాజ్ ఫ్యాన్స్ అందరూ కూడా సంతోషంలో మునిగి తేలుతున్నారు .